ETV Bharat / state

వాసుదేవరెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట- అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ - VASUDEVA REDDY BAIL - VASUDEVA REDDY BAIL

HC on AP Beverages Vasudeva Reddy Bail Petition: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఈనెల 18లోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

AP_Beverages_Vasudeva_Reddy_Bail_Petition
AP_Beverages_Vasudeva_Reddy_Bail_Petition (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 3:22 PM IST

Updated : Jun 13, 2024, 7:36 PM IST

HC on AP Beverages Vasudeva Reddy Bail Petition: బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈనెల 18లోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. వాసుదేవరెడ్డి కీలక పత్రాలు మాయం చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ ఇవ్వాలంటూ పిటిషన్ వేయగా హైకోర్టులో విచారణ జరిగింది.

వాసుదేవరెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట- అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ (ETV Bharat)

సీఐడీ తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అధికారులు కోర్టును కోరారు. వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ఆ రోజు లోపు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు - CID Raids at Vasudeva Reddy House

కాగా ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఈ నెల 6న కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచికచర్ల వాసి గద్దె శివకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ.. విలువైన ఆధారాలు, వస్తువుల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో వాసుదేవరెడ్డిపై ఐపీసీ 427, 379 రెడ్‌విత్‌ 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

తాడేపల్లికి చేరిన వేల కోట్లపై నోరు విప్పే ధైర్యం వాసుదేవారెడ్డికి ఉందా?: ఏలూరి సాంబశివరావు

Last Updated : Jun 13, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.