ETV Bharat / state

ప్రయోగశాలలో ఆకతాయి ప్రయోగం - 25 మంది విద్యార్థులు అస్వస్థత - చంద్రబాబు ఆరా - HAZARDOUS GASES IN SCIENCE LAB - HAZARDOUS GASES IN SCIENCE LAB

Hazardous Gases Released in Kendriya Vidyalaya Science Lab: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ఓ విద్యార్థి పిల్లచేష్టలు 21 మంది సహచరుల్ని అస్వస్థతకు గురి చేసింది. తరగతి గదిలో టీచర్‌ లేని సమయంలో ఇంటి నుంచి తెచ్చిన కొన్ని పదార్థాలను రసాయానాలను కలపడంతో వాయువులు వ్యాపించి పిల్లలు సొమ్మసిల్లి కింద పడిపోయారు. ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారు.

Hazardous Gases in Kendriya Vidyalaya
Hazardous Gases in Kendriya Vidyalaya (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 2:43 PM IST

Updated : Aug 24, 2024, 3:27 PM IST

Hazardous Gases Released in Kendriya Vidyalaya Science Lab : బాపట్ల జిల్లా సూర్యలంక వాయుసేనా కేంద్రం ఆవరణలోని కేంద్రీయ విద్యాలయలో 25 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలు సుజాత క్లోరోఫిల్‌ ఆమ్లం, నిమ్మ ఉప్పుతో ఓ ప్రయోగాన్ని విద్యార్థుల ఎదుట ప్రదర్శించారు. ఆమె బయటకు వెళ్లగానే నవ్య శ్రీ అనే విద్యార్థిని కాఫీపొడితో పాటు ఉప్పు, శానిటైజర్, పంచదారను ఉపాధ్యాయురాలు తయారు చేసిన మిశ్రమానికి కలిపారు. దీంతో వాయువులు ఆరో తరగతి గదితో పాటు ఎదురుగా ఉన్న ఏడో తరగతి గదిలోకి వ్యాపించాయి.

అది పీల్చిన 25 మంది విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొందరు స్పృహ తప్పారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వాయుసేనా కేంద్ర ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం బాపట్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు చికిత్స అందిచడంతో 23 మంది కోలుకున్నారు. ఒక విద్యార్థి షణ్ముఖకు గుండె సమస్య ఉన్నట్లు ఈసీజీలో వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం షణ్ముఖను గుంటూరులోని ఆస్పత్రికి అధికారులు తరలించారు. మరో విద్యార్థిని మాధురికి జ్వరం రావడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

విద్యార్థులను పరామర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ : వాయువు వెలువడటానికి కారణమైన మిశ్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్‌ వైద్యశాల సూపరింటెండెంట్‌ సిద్ధార్థకు అందజేశారు. రసాయన మిశ్రమాన్ని పరీక్షల నిమిత్తం గుంటూరులో ప్రయోగశాలకు పంపించారు. జాయింట్‌ కలెక్టర్‌, బాపట్ల తహసీల్దార్‌ ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. సూర్యలంక వాయుసేనా కేంద్రం కమాండర్, గ్రూప్‌ కెప్టెన్‌ శ్రీవాస్తవ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చి సూపరింటెండెంట్‌ సిద్ధార్థతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్రబాబు ఆరా : ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఆదేశించారు.

"నవ్య శ్రీ ఉప్పు, శానిటైజర్, పంచదార కాఫీపొడి ఇంటి దగ్గర నుంచి తీసుకువచ్చి మిశ్రమంలో కలిపింది. దీంతో క్లాస్​లో పొగలు వ్యాపించాయి. ఆ పొ పీల్చడంతో మేము వాంతులు చేసుకున్నాం. అక్కడే కళ్లు తిరిగి కింది పడిపోయాం. మా సార్ వాళ్లు ఆస్పత్రికి తీసుకువచ్చారు." - విద్యార్థులు

Last Updated : Aug 24, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.