ETV Bharat / state

అక్రమ కేసులు బనాయించడమేనా ప్రజాపాలన అంటే? : హరీశ్​రావు - Harish Rao On Koushik Reddy Issue

Harish Rao On koushik reddy Issue : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై క్రిమినల్​ కేసు నమోదు చేయడంపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ట్వీట్​ చేశారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనంటే అని మండిపడ్డారు.

Harish Rao On koushik reddy Issue
Harish Rao On koushik reddy Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 3, 2024, 4:21 PM IST

Harish Rao Tweet On MLA Kaushik Reddy Case : హుజూరాబాద్​ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా? అని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' వేదికగా సూటి ప్రశ్న వేశారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలనంటే అంటూ మండిపడ్డారు.

బెదిరింపులకు బీఆర్ఎస్​ భయపడదు : కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్​ఎస్​ భయపడదని స్పష్టం చేశారు. ప్రతీకార చర్యలు అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. "హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డిపై క్రిమినల్​ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్​రెడ్డి చేసిన తప్పా? ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజాపాలన?" అని హరీశ్​రావు ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

Harish Rao Fires On Congress Govt : కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఎక్కడ చూసిన అన్నదాతల అత్మహత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. గ్రామ పంచాయతీలు ఆగమాగం అవుతున్నాయన్నారు. పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలొ పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్​రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షాల మీద కుట్రలు తప్ప చేసిందేమీ లేదు : ప్రతిపక్షాల మీద కుట్రలు తప్ప కాంగ్రెస్​ చేసిందేమీ లేదని హరీశ్​రావు విమర్శించారు. ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మే, జూన్​ల పెన్షన్​ ఎగ్గొట్టారన్నారు. పక్క రాష్ట్రం వారు పెన్షన్​ ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేత కావడం లేదని ప్రశ్నించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇప్పటివరకు ఇవ్వ లేదన్నారు. పాలన చేతకాక గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా 7 పైసలు కూడా విడుదల చేయలేదు: హరీశ్ రావు - BRS leader Harish Rao Key Comments

రెండు జాతీయ పార్టీలు బీఆర్​ఎస్​ను టార్గెట్ చేశాయి​ : హరీశ్​ రావు - Harish Rao on CM Revanth Reddy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.