ETV Bharat / state

సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి - ఖర్గేకు హరీశ్​రావు కంప్లైంట్ - Harish Rao Letter To AICC Kharge - HARISH RAO LETTER TO AICC KHARGE

Harish Rao Open Letter To AICC : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్​రావు సుదీర్ఘ లేఖ రాశారు. కేసీఆర్​ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి లేఖలో పేర్కొన్నారు.

Harish Rao Open Letter To AICC Mallikarjun Kharge
Harish Rao Open Letter To AICC Mallikarjun Kharge (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 5:15 PM IST

Harish Rao Open Letter To AICC Mallikarjun Kharge : మాజీ సీఎం కేసీఆర్​ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ నేత హరీశ్​రావు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. కేసీఆర్​పై రేవంత్ ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

దిల్లీలో ఒక రూల్ - గల్లీలో ఒక రూల్ : రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్​పై దూషణలు, కించపరచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడు తనానికి పరాకాష్ట అన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందని రాజకీయాల్లో దిగజారుడు విమర్శలను తీవ్రంగా ఖండించిందన్న ఆయన రాజ్యాంగ విలువలను దిగజారుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం కాదా? అని ధ్వజమెత్తారు. దిల్లీలో ఒక రూల్ గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్​కే చెల్లుతుందని విమర్శలు గుప్పించారు.

Harish Rao Open Letter To AICC
మల్లికార్జున ఖర్గేకు హరీశ్​ రావు రాసిన లేఖ (ETV Bharat)

రాష్ట్రం అప్పులపై సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారు : హరీశ్​రావు - Harish Rao on CM Revanth

జర్నలిస్టులపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి : రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్న ఆయన కాంగ్రెస్ అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులకు నీతులు చెప్పడం శోచనీయంగా ఉందన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చడం కాదా అన్న ఆయన కేసీఆర్​ను రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్​హై కమాండ్ సమర్ధిస్తుందా అని నిలదీశారు. హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.

కాంగ్రెస్ నియంతృత్వా పాలనకు నిదర్శనం : రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్ నాయకులపై నిరాధార కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుంది అని చెప్పేందుకు ఇది నిదర్శనంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటిదేనని తెలిపారు.

రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో చెప్పారు.

'కేసీఆర్​పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినా - లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవు' - ktr comments on MSME Programme

'రేవంత్ మీ లక్ వ్యాలిడిటీ ఐదేళ్లు మాత్రమే - కాస్త సీఎంలా ప్రవర్తించండి' - Harish Rao Fires On CM Revanth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.