ఎలక్షన్ కోడ్‌లోపు ఆరు గ్యారంటీలను అమలుచేయాలి : హరీశ్‌రావు - హరీష్ రావు
Harish Rao Comments on Six Guarantees : వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఎన్నికల కోడ్‌తో తప్పించుకోవద్దని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ, 4000 పెన్షన్, వడ్లకు బోనస్ ఎన్నికల కోడ్‌లోపే ఇవ్వాలని కోరారు.
Published : Jan 26, 2024, 7:27 PM IST
Harish Rao Comments on Six Guarantees : తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని మాజీమంత్రి హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎర్రవల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఎన్నికల కోడ్‌తో తప్పించుకోవద్దని హరీశ్‌రావు(Harish Rao) పేర్కొన్నారు.
ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడదాం - త్వరలోనే ప్రజల్లోకి వస్తాను : కేసీఆర్
BRS Parliamentary Party Meeting : ఎన్నికల కోడ్ రాకముందే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ, రూ.4000 పెన్షన్, వడ్లకు బోనస్ ఎన్నికల కోడ్‌లోపే ఇవ్వాలని కోరారు. కృష్ణా బోర్డు(Krishna Board)కు ప్రాజెక్టుల స్వాధీనం సహా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు హరీశ్‌రావు తెలిపారు.
వివిధ అంశాలపై ఆయా శాఖల మంత్రులను ఎంపీలు కలవాలని నిర్ణయించారు. కృష్ణా ప్రాజెక్టుల విషయమై పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా పోరాడాలని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఎంపీలకు కేసీఆర్(KCR) స్పష్టం చేసినట్లు తెలిపారు. గత పదేళ్లుగా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పజెప్పకుండా చాలా విషయాలపై తాము స్పష్టత అడిగామని, స్పష్టత లేకుండా ప్రాజెక్టులు అప్పగించబోమని మేం గతంలో తెలిపామని అన్నారు.
త్వరలో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా - కేసీఆర్, కేటీఆర్ పోటీపై ఇదే క్లారిటీ
కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు ఆక్షేపించారు. వారి అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. హామీల అమలు గురించి అడిగితే చెప్పుతో కొడతామని అంటున్నారని, చెప్పిన దాన్ని గుర్తు చేస్తే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరును సమాజం గమనిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసహనం కాంగ్రెస్ వైఖరిగా ఉందని హరీశ్‌రావు అభివర్ణించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని ప్రశ్నించిన ఆయన, ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని మండిపడ్డారు.
"కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్, ఎన్నికల కోడ్ రాకముందే ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నికల కోడ్ సాకుతో తప్పించుకోవద్దు. రైతులకు రుణమాఫీ, రూ.4000 పెన్షన్, వడ్లకు బోనస్ ఎన్నికల కోడ్‌లోపే ఇవ్వాలి". - హరీశ్‌రావు, మాజీ మంత్రి
నిజామాబాద్ లోక్‌సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?