Gutha Amit Joins Congress : భారత్ రాష్ట్ర సమితికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధికారాన్ని కోల్పోవడంతో నాయకులంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా, ఇంకా కొంతమంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. తాజా పరిణామాలన్నీ బీఆర్‌ఎస్ హైకమాండ్‌కు ఇబ్బందికరంగా మారాయి.
TS Lok Sabha Elections 2024 : తాజాగా శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అమి కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
గుత్తా అమిత్‌రెడ్డి నల్గొండ లేదా భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేయాలని భావించారు. అయితే ఆయన నల్గొండ నుంచి అవకాశం కల్పిస్తే పోటీ చేస్తానని సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అమిత్‌కు టికెట్ ఇచ్చే విషయమై నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన గులాబీ పార్టీ సీనియర్ నేత ఒకరు ఇందులో కీలక పాత్ర పోషించారు.
దీంతో గుత్తా అమిత్‌రెడ్డి సందిగ్ధంలో పడిపోయారు. స్థానికంగా పార్టీ నేతలు సహకరించనప్పుడు పోటీ చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన బీఆర్ఎస్ అధిష్ఠానానికి స్పష్టంగా చెప్పినట్లుగా తెలిసింది. ఈ పరిణామాల అనంతరం గుత్తా అమిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఇటీవలే భేటీ అయిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు
పార్టీ మార్పుపై స్పందించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి : మరోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా పార్టీ మారుతారనే ఊహాగాలు వినిపించాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతున్న అనేది అవాస్తవమని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలోనే తన కుమారుడు అమిత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇవ్వలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమని అన్నారు. స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి అమిత్‌ను ఎంపీగా పోటీ చేయాలని కోరారని పేర్కొన్నారు. దీనిపై జిల్లాలోని నాయకులు కొందరూ సహకరిస్తామన్నారని, మరి కొంతమంది తామే పార్టీ మారుతున్నామని చెప్పారని వివరించారు. అందుకే పోటీ నుంచి అమిత్ తప్పుకున్నట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి - Lok Sabha Elections 2024