ETV Bharat / state

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా - Power Lifter Bharat Kumar - POWER LIFTER BHARAT KUMAR

Guntur Young Sportsman Panadrla Bharat Kumar : ఆటలంటే క్రికెట్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఫుట్‌బాల్ వంటి సామూహిక క్రీడలే కాదు. వ్యక్తిగత క్రీడల్లోనూ సత్తాచాటవచ్చు. దీన్ని గుర్తించిన ఆ యువకుడు కబడ్డీ నుంచి పవర్‌లిఫ్టింగ్‌ వైపు అడుగులేశాడు. అందులోని మెళకువలను నేర్చుకున్నాడు. ఇటీవల జరిగిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ యూనివర్సిటీ కప్‌ 2023-24 పోటీల్లో బంగారు పతకంతో మెరిశాడు.

power_lifting_bharat
power_lifting_bharat (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 12:59 PM IST

Guntur Young Sportsman Panadrla Bharat Kumar : చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం భరత్​ కుమార్​ అలవాటుగా చేస్తున్నాడు. దీంతో పాటు వివిధ క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ప్రస్తుతం అదే చురుగుతనం ప్రదర్శించి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ యూనివర్శిటీ కప్‌ 2023-24 పోటీల్లో బంగారు పతకంతో సత్తాచాటాడు.
పందిర్ల భరత్‌ కుమార్‌ది గుంటూరు జిల్లా మంగళగిరి స్వస్థలం. చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం అలవాటుగా చేసుకున్నాడు భరత్‌. పాఠశాలలో చదివేటప్పుడు కబడ్డీలో రాణించేవాడు. ఇతని శక్తి సామర్థ్యాలను గుర్తించిన వ్యాయామ ఉపాద్యాయుడు పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడవైపు వెళ్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించాడు.

అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
వ్యాయామ ఉపాద్యాయుడి సలహా మేరకు పవర్‌ లిఫ్టింగ్‌ సాధన చేయడం మొదలు పెట్టాడు భరత్‌. ఇంటర్‌లో ఉండగానే వివిధ టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచాడు. తన క్రీడా నైపుణ్యంతో విజయవాడలోని కేబీఎన్​ (KBN) కళాశాలలో ఉచితంగా డిగ్రీలో ప్రవేశం పొందాడు. అయితే పవర్‌ లిఫ్టింగ్‌ ఎంచుకున్న తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు చవిచూశానని ఈ క్రీడాకారుడు అంటున్నాడు. అండర్‌-19 పోటీల్లో స్వర్ణం సాధించడంతో తనలో విశ్వాసం పెరిగిందని చెబుతున్నాడు.

ఐపీఎస్ కోసం పవర్ లిఫ్టింగ్​పై దృష్టి - అంతర్జాతీయ పోటీల్లో సత్తా
ప్రస్తుతం కేబీఎన్​ కాలేజీలో యోగా డిప్లమా చదువుతున్నాడు. కళాశాల పీడీ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు తన ప్రతిభకు పదును పెడుతున్నాడు. 2022 టర్కీలో జరిగిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. అదే పట్టుదలతో 2 సంవత్సరాలు కఠోర సాధన చేసి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ యూనివర్సిటీ కప్‌ 2023-24 పోటీల్లో బంగారు పతకం సాధించానని చెబుతున్నాడు

ఒలంపిక్స్​లో పసిడి పతకమే లక్ష్యం - పవర్‌లిఫ్టింగ్‌లో ​గుంటూరు యువ క్రీడాకారుడు సత్తా (ETV Bharat)

ప్రతిభకు అడ్డురాని పేదరికం - పవర్​ లిఫ్టింగ్​లో శ్రీకాకుళం యువకుడు సత్తా

పవర్‌లిఫ్టింగ్‌ క్రీడలో రాణించాలంటే ఆహారం, వ్యాయమం రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ పవర్‌లిఫ్టర్‌ సూచిస్తున్నాడు. ఈ ఏడాది జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లడానికి కుటుంబంతో పాటు కేజీఎన్​ కళాశాల యాజమాన్యం ఎంతో సహకరించిందని ఈ యువ క్రీడాకారుడు చెబుతున్నాడు.

పవర్‌ లిఫ్టింగ్‌లో శరీర బరువును స్థిరంగా ఉంచుకోవాలని కళాశాల పీడీ హేమచంద్రరావు సూచిస్తున్నారు. ఆ కారణం వల్లే 2022 పోటీల్లో భరత్‌కుమార్‌ బంగారు పతకాన్ని కోల్పోయాడని అంటున్నాడు. మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాడు.

'పవర్'​ఫుల్ వృద్ధుడు- రష్యన్ IPL​లో సత్తా! 57 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించి విజయవాడకు వచ్చిన భరత్‌కి కళాశాల తరపున భారీ ర్యాలీతో స్వాగతం పలికామని కాలేజీ అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 4 సార్లు తమ కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటారని వివరిస్తున్నారు. అంతర్జాతీయ పతకాలు సాధించేలా ఈ క్రీడాకారుడిని ప్రోత్సహిస్తామని చెబుతున్నారు.

పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడకు ఉండే ప్రత్యేకతే వేరు. శారీరక ధారుడ్యంతో పాటు శక్తి సామర్థ్యాలు ఉండాలి. అలాంటి క్రీడలో భరత్‌ రాణిస్తున్నాడు . అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. దేశం తరపున ఒలింపిక్స్‌ పాల్గొని దేశానికి పతకం తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నాడీ పవర్‌లఫ్టర్‌.

సరికొత్త ఆలోచనలకు నాంది - నూతన ఎంటర్​ప్రెన్యూర్​కు శ్రీకారం హ్యాకథాన్​ పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.