ETV Bharat / state

కాలుష్యం కోరల్లో గుంటూరు ఛానల్ - అనారోగ్యంతో ప్రజల ఇబ్బందులు - Guntur Channel Contamination

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 12:13 PM IST

Guntur Channel Contamination Due to Drainage : గుంటూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ప్రధానమైన కాలువ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. మురుగు కలుస్తుందని తెలిసినా అధికార యంత్రాంగం పట్టించుకోవటంలేదు. ఫలితంగా పల్లెవాసులు కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నారు.

guntur_channel_contamination_due_to_drainage
guntur_channel_contamination_due_to_drainage (ETV Bharat)

Guntur Channel Contamination Due to Drainage : 47 కిలోమీటర్ల పొడవున ఉండే గుంటూరు ఛానల్ కాలువ వల్ల 27వేల ఎకరాలకు సాగునీరందుతోంది. 36 గ్రామాల రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. 12 గ్రామాలకు ఈ కాలువ నుంచి తాగునీరు సరఫరా చేస్తుంటారు. ఇంతటి కీలకమైన కాలువ కొన్నేళ్లుగా కాలుష్యం బారిన పడింది. గుంటూరు నగరంతోపాటు ఉండవల్లి, తాడేపల్లి, మంగళగిరి, పెదకాకానిలోని వివిధ ప్రాంతాల నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లో కలుస్తోంది.

మురుగు నీరు డ్రెయిన్లలోకి వెళ్లేందుకు దశాబ్దాల క్రితమే చప్టాలు నిర్మించారు. అయితే చప్టాలు శిథిలం కావటంతో అక్కడి నుంచి మురుగునీరు గుంటూరు ఛానల్లో కలుస్తోంది. మురుగునీరు కలవటం ద్వారా ప్రమాదకర పదార్థాలతో కాలువనీరు విషతుల్యం అవుతోంది. అనంతవరప్పాడు, లేమల్లెపాడు, గారపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

ఆయా గ్రామాలకు నీటిని సరఫరా చేసే క్రమంలో ఫిల్టర్ పాయింట్ల ద్వారా శుద్ధి చేసినా రసాయన అవశేషాలు మాత్రం నీటి నుంచి వేరుకావు. దీంతో ఆ నీరు తాగాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొందరు చర్మ వ్యాధుల బారిన పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో కాలువల మరమ్మతులు చేయలేదని కనీసం కాలువల్లో గుర్రపుడెక్క కూడా తొలగించలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు కాలువపై సుమారు 45 గ్రామాలు ఆధారపడి జీవిస్తున్నాయి. సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చే కాలువ నేడు మురుగుమయంగా మారింది. దిక్కు లేక మేము అదే నీరు తాగి రోగాలపాలవుతున్నాం. పంట పొలాలకు నీరు పెట్టుకున్నా అవి కూడా నల్లగా మారుతున్నాయి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మంపై దద్దుర్లు వస్తున్నాయి. గుంటూరు మురుగు అంతా దీనిలో కలవడమే కారణం. గత ప్రభుత్వ డ్రైనేజ్​ వ్యవస్థను బాగు చేస్తే నేడు ఈ సమస్య రాకపోయేది. -స్థానికులు

గుంటూరు ఛానల్ పొడిగింపుపై జగన్ హామీలు- గాలిమాటలేనా! - CM Jagan Forget Their Promises

మురుగునీరు గుంటూరు కాలువలో కలుస్తున్న విషయంపై నీటిపారుదల శాఖ అధికారులు నగరపాలక సంస్థకు, ఆయా పురపాలికలకు లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కాలువను పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. పూర్తిస్థాయిలో చప్టాలు నిర్మించాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలోపే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పటికైనా కాలువపై ఉన్న చప్టాల నుంచి డ్రైనేజీ కాలువలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గుంటూరు ఛానెల్​పై కంటితుడుపు చర్యలు కాదు - రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామన్న హామీ ఎక్కడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.