ETV Bharat / state

'గృహజ్యోతి'కి ఆధార్ కార్డు​ తప్పనిసరి - ఇలా చేస్తేనే ఫ్రీ కరెంట్​కు అర్హులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2024, 7:13 AM IST

Gruha Jyothi Scheme in Telangana : ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేయనున్న ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. గృహజ్యోతి ఉచిత కరెంట్‌ లబ్ధి పొందాలనుకునేవారు ముందుగా ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్‌ సిబ్బంది ద్వారానే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.

Gruha Jyothi Scheme in telangana
Gruha Jyothi Scheme in telangana

గృహజ్యోతిలో భాగంగా ఉచిత విద్యుత్‌కు ఆధార్‌ తప్పనిసరి

Gruha Jyothi Scheme in Telangana : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు హమీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు అనే రెండు గ్యారంటీలు అమలులోకి తెచ్చింది. తాజాగా ఇళ్లకు ఉచిత కరెంట్ సరఫరా పథకం గృహజ్యోతి అమలు ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది.

Aadhaar Mandatory Gruha Jyothi Scheme : ఇందులో భాగంగా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్‌ ఆథెంటిఫికేషన్‌ (Aadhaar Mandatory) చేయించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే, ఆధార్‌ సహా గుర్తింపుకార్డులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు బయోమెట్రిక్‌ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధనశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచనలు చేసింది.

గృహజ్యోతి పథకంపై ప్రభుత్వం కసరత్తు - అర్హుల వివరాల సేకరణలో విద్యుత్​ పంపిణీ సంస్థలు

Gruha Jyothi Scheme Guidelines : దీన్నిబట్టి లబ్ధిదారుల ఎంపికకు పూర్తి స్థాయి మార్గదర్శకాలు తరువాత వెలువడతాయని అధికారులు భావిస్తున్నారు. గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme) లబ్ధిదారుల ఆధార్‌ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధనశాఖ నిర్దేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంట్ కనెక్షన్‌ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్‌ను విద్యుత్‌ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్‌ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువు చూపాలి. ఆధార్‌ జారీ అయ్యేవరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్‌ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది.

బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లో ఖాతాదారుడి ఫొటోతో ఉన్న జిరాక్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్‌ పాస్‌బుక్, డ్రైవింగ్‌ లైసెన్స్, రేషన్‌ కార్డు, ఎవరైనా గెజిటెడ్‌ అధికారి లేదా తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, వీటిలో ఏదో ఒకటి విద్యుత్‌ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవచ్చని ఇంధనశాఖ సూచనలు చేసింది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది.

అద్దెకు ఉండే వారికీ 'గృహజ్యోతి' వర్తింపు - ముమ్మరంగా వినియోగదారుల వివరాల సేకరణ

ఆధార్‌ ధ్రువీకరణ పొందాలంటే బయోమెట్రిక్‌ పరికరాలతో వేలిముద్ర లేదా ఐరిస్‌ స్కాన్‌ చేయాలి. డిస్కంలే ఇందుకోసం ఏర్పాట్లు చేయాలి. పరికరాలు పని చేయకపోతే ఆధార్‌ నంబరును నమోదు చేయగానే, దాని యజమాని సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే ఆధార్‌ కార్డుపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

రాష్ట్రంలో వారికి మాత్రమే ఫ్రీ కరెంట్​! - ప్రభుత్వ మార్గదర్శకాలివే!!

త్వరలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ​- గృహజ్యోతి పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.