ETV Bharat / state

మీరు గ్రూప్-2 ఎగ్జామ్ రాస్తున్నారా - ఇవి లేకపోతే పరీక్ష రాసేందుకు 'నో ఎంట్రీ'

గ్రూప్- 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు - పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం.

Group 2 Exams Instructions
Group 2 Exams Instructions To Candidates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 3 hours ago

Group 2 Exams Instructions To Candidates : గ్రూప్- 2 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు టీజీపీఎస్సీ పలు సూచనలు చేస్తోంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. వ్యక్తిగతంగా సైతం మెసేజ్​ల రూపంలో సూచనలను పంపుతోంది. పరీక్షకు హాజరయ్యే వారు తప్పని సరిగా హాల్​టికెట్​పై పాస్​పోర్ట్ సైజ్ లేటెస్ట్ ఫోటోలను అతికించాలని పేర్కొంది. హాల్ ​టికెట్​పై ఫోటోలేని వారిని పరీక్ష రాసేందుకు అనుమతించమని పేర్కొంది.

పరీక్షల తేదీ, సమయం : డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్​ -1 జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్​-2, అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్​ 3,4 పరీక్ష ఉంటుంది.

నిమిషం ఆలస్యమయినా అనుమతించరు :

  • పరీక్షకు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించుకోవాలని.. దీంతో పరీక్షరాయడానికి సెంటర్లకు సమయానికి చేరుకోవచ్చని తెలిపింది.
  • ఎగ్జామ్ ప్రారంభించడానికి గంట ముందు నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించనున్నట్టు పేర్కొంది.
  • పరీక్ష ప్రారంభమయ్యే సమయం కంటే అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
  • పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని టీజీపీఎస్సీ స్ఫష్టం చేసింది.
  • బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టిక్కెట్, ఏదైనా గుర్తింపు కార్డులను(ఆధార్, పాన్​కార్డు) మాత్రమే అభ్యర్థి పరీక్షా కేంద్రంలోనికి తీసుకురావాలని తెలిపింది.
  • అభ్యర్థులు ఓఎంఆర్​ షీట్​లో బబ్లింగ్​ తప్పులు లేకుండా రాయాలని సూచించింది.
  • సెల్ ఫోన్లు, ట్యాబ్​లు, పెన్​డ్రైవ్​లు, బ్లూటూత్​లు, స్మార్ట్ వాచ్​లు, హ్యాండ్ బ్యాగ్​లు, పౌచ్​లు, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, ఛార్ట్​లు లోపలికి అనుమతించరని తెలిపారు.

హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ : హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ కోసం అభ్యర్థులు తమకు సంబంధించిన టీజీపీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. అనంతరం డౌన్​లోడ్​ పీడీఎఫ్​ అనే ఆప్షన్​పై క్లిక్​ చేస్తే వెంటనే హాల్​టికెట్​ డౌన్​లోడ్​ అవుతుంది. ఈ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను పెట్టారు. అభ్యర్థులు ఈ నంబర్లకు ఫోన్​ చేసి వివరాలను అడగవచ్చు. ఇంకా అదనపు సమాచారం కావాలంటే టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 23542185/23542187/040-22445566/కు ఫోన్ చేయొచ్చు. లేదా ఈ-మెయిల్‌ కావాలంటే helpdesk@tspsc.gov.inకు చేయవచ్చు.

గ్రూప్​-2 పరీక్షలు యథాతథం - వాయిదాకు నిరాకరించిన హైకోర్టు

గ్రూప్‌-2 అభ్యర్థులకు మరో అప్​డేట్ - ఈనెల 9 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు లభ్యం

Last Updated : 3 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.