ETV Bharat / state

తొలిరోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష - TGPSC GROUP 1 MAINS EXAM TODAY

తొలిరోజు ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష - పరీక్షకు హాజరైన 31,383 మంది - పలు చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించని అధికారులు

GROUP 1 MAINS EXAM INSTRUCTIONS
TGPSC Group one mains Starts From Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 21, 2024, 7:38 AM IST

Updated : Oct 21, 2024, 10:05 PM IST

TGPSC Group-1 Mains Exams From Today : నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఉత్కంఠగా మారిన గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టంచేయటం, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించటంతో మెయిన్స్‌కు ఉన్న అవాంతరాలు తొలగినట్టైంది. పరీక్షకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించిన అధికారులు, 1:30 గంటలకు గేట్లు మూసివేశారు. ఆలస్యంగా వచ్చిన పలువురిని ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరిగాయి. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. దీంతో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎగ్జామ్​ రూమ్, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను జీపీఎస్‌ ట్రాకింగ్​ అమర్చిన వాహనాల్లో తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో నిర్దేశిత మార్గాల్లోనే ఆ వాహనాలు ప్రయాణించేలా రూట్​ మ్యాప్​ సిద్ధం చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిబంధనలు ఇవే

  • గ్రూప్​- 1 అభ్యర్థులను డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌ (డీఎఫ్‌ఎండీ)లతో తనిఖీ చేశాకే పరీక్షకు అనుమతిస్తున్నారు.
  • హాల్​ టికెట్​లో పేర్కొన్న సూచనలు పాటించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసింది.
  • హాల్‌ టికెట్లు, ప్రశ్నపత్రాలను తుది నియామకాలు పూర్తయ్యే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించింది.
  • ఇన్విజిలేటర్లు సైతం కచ్చితంగా పాటించాలంటూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
  • అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్‌ రంగు బాల్‌ పాయింట్‌ పెన్, పెన్సిల్, రబ్బరు, హాల్‌ టికెట్ వెంట తెచ్చుకోవాలి.
  • ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. బొమ్మలు పెన్సిల్‌ లేదా పెన్‌తో వేయాలి. జెల్, స్కెచ్‌పెన్‌లు వంటివి వాడకూడదు.
  • తొలి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే హాల్‌ టికెట్‌ను మాత్రమే ఉపయోగించాలి.
  • హాల్‌ టికెట్‌ మార్చి తీసుకొస్తే అనుమతించరు.
  • హాల్‌ టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజిలేటర్‌ కూడా సంతకం చేయాలి.
  • జవాబులు రాసేందుకు ఆన్సర్‌ బుక్‌లెట్‌ ఇస్తారు. అదనపు పత్రాలు ఇవ్వరు.
  • అభ్యర్థి ఎంపిక చేసుకున్న లాంగ్వేజ్ ​(జనరల్‌ ఇంగ్లీష్‌ మినహా)లోనే ఆన్సర్స్​ రాయాలి.
  • వేర్వేరు భాషలో రాస్తే ఆ జవాబు పత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా ప్రకటిస్తుంది.
  • దివ్యాంగ అభ్యర్థుల హాల్‌ టికెట్లపై స్క్రైబ్‌ (పరీక్ష రాయడానికి సహాయకులు) విషయాన్ని ప్రత్యేకంగా వివరించడంతో పాటు వీరి కోసం ప్రత్యేకంగా 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • దివ్యాంగ అభ్యర్థులకు అదనంగా గంట సమయాన్ని కేటాయిస్తారు. వీరు సదరం ధ్రువపత్రం తీసుకురావాలి.

పోలీసుల నిఘా నీడలో 'మెయిన్స్' - తొలిసారి జీపీఎస్ ట్రాకింగ్ విధానం అమలు

Last Updated : Oct 21, 2024, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.