Grandson killed grandmother: చెడు వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు, సెల్ ఫోన్ కొనడం కోసం సొంత నానమ్మను హత్య చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. సెల్ ఫోన్ కొనడానికి డబ్బుల కోసం వృద్దురాలి మెడలో ఉన్న బంగారాన్ని చోరీ చేసి అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. తమ అమ్మ కనిపించడం లేదంటూ ఆమె చిన్నకుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో, నాగమ్మ అనే వృద్దురాలి హత్య ఘటన వెలుగు చూసింది.
సెల్ ఫోన్ డబ్బుల కోసం నానమ్మను ఆమె మనువడు దారుణంగా హత్య చేసిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దమర్రివీడు గ్రామానికి చెందిన బజారి కుటుంబంతో కలిసి గత కొంత కాలంగా గుంటూరులో ఉంటున్నాడు. అతని కుమారుడు వెంకటేష్ (19) గత కొంత కాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో కొత్త సెల్ ఫోన్ కొనాలన్న ఆశ కలిగిన వెంకటేష్, పెద్దమర్రివీడు గ్రామంలో ఉంటున్న తన నానమ్మ అయిన నాగమ్మ మెడలో ఉన్న రెండున్నర తులాలు ఉన్న బంగారు గొలుసు కొట్టేయాలనుకున్నాడు. పథకం ప్రకారం, వెంకటేష్ గ్రామంలో ఉంటున్న తన నానమ్మ నాగమ్మ (84) దగ్గరికి వచ్చాడు.
భార్యపై అనుమానం- నోట్లో కరెంట్ వైర్ పెట్టి హత్య చేసిన భర్త
ఇంట్లో ఒంటరిగా ఉన్న నాగమ్మ గొలుసు చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ప్రతిఘటించిన నాగమ్మను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఆమె మెడపై ఉన్న గొలుసును దొంగిలించాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా నాగమ్మ శవాన్ని ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టాడు. చోరీ చేసిన బంగారు గొలుసును విక్రయించిన వెంకటేష్ సెల్ ఫోన్ కొనుకున్నాడు. నాగమ్మ చిన్నకుమారుడు చిన్న బజారి కర్నులులో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన చిన్న బజారి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో నాగమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని విచారించాడు. ఎంతకీ నాగమ్మ ఆచూకీ తెలియకపోవడంతో, నాగమ్మ కనిపించడం లేదంటూ చిన్న బజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నాగమ్మను హత్య చేసింది పెద్ద బజారి కొడుకు వెంకటేష్ అని తెల్చారు. ఈనెల 4వ తేదీన తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్ధురాలిపై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. నిందితుడి నుంచి బంగారు వస్తువులు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇంటి ఆవరణలో పూడ్చిన నాగమ్మ శవాన్ని బయటకు తీశారు. అనంతరం శవపరీక్షల కోసం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి నట్లు పోలీసులు తెలిపారు.