ETV Bharat / state

నిషేధిత జాబితాలో వందలాది లే అవుట్లు - మీ భూములు కూడా ఉంటే చెక్ చేస్కోండి - HMDA LAYOUTS BANNED ISSUE

నిషేధిత జాబితాలో వందలాది లే అవుట్లు - సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న జాబితా

HMDA Layouts Banned Issue
HMDA Layouts Banned Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 12:02 PM IST

Updated : Oct 22, 2024, 4:50 PM IST

HMDA Layouts Banned Issue : హెచ్​ఎండీఏ పరిధిలోని వందలాది పంచాయతీ లేఅవుట్లు నిషేధిత జాబితాలో చేర్చారని కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఇదే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై రకరకాల ఊహాగానాలు, వదంతులు వినిపిస్తుండటంతో ఆయా లేఅవుట్ల యజమానులు బెంబేలెత్తి పోతున్నారు. ఈ క్రమంలో వారు హెచ్​ఎండీఏ కార్యాలయానికి పరుగుతీస్తున్నారు. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ జాబితాపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు అధికారులు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

గతంలో వందలాది పంచాయతీ లేఅవుట్లు హెచ్​ఎండీఏ ఏర్పడకముందు ఏర్పడ్డాయి. ఇవి ముఖ్యంగా రంగారెడ్డి, పెద్ద అంబర్​పేట్​, అబ్దుల్లాపూర్​మెట్​, ఆదిభట్ల, మంగల్​పల్లి, మన్నెగూడ, తుర్కయంజాల్​, కమ్మగూడ, రాగన్నగూడ, నాదర్​గుల్​, గుర్రంగూడ, బాలాపూర్​ తదితర ప్రాంతాల్లో వందలాది పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిని అప్పుడే లేఅవుట్లు వేసి విక్రయించేశారు. హెచ్​ఎండీఏ వచ్చిన తర్వాత ఈ లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించారు. ఈ క్రమంలో వీటిలో పెద్దపెద్ద బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి.

ప్రస్తుతం ఇవన్నీ నగరానికి సమీపంలో ఉన్నాయి. ఇక్కడ భూములు ధరలు సైతం భారీగానే పలుకుతున్నాయి. ఇంకా కొన్ని లేఅవుట్ల క్రమబద్ధీకరించలేదు. వీటి కోసం గతంలో చాలా మంది రూ.1000 చెల్లించి అక్రమంగా లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్​ఆర్​ఎస్​) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే ఈ నిషేధిత జాబితా సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొట్టింది. దీంతో ఒక్కసారిగా దరఖాస్తుదారులు అవాక్కయ్యారు. ఇదేంటి ఎల్​ఆర్​ఎస్​కు దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయందని లబోదిబోమంటున్నారు.

ఆందోళనలో యజమానులు : ఈ పంచాయతీ లేఅవుట్లని ఏపీ రిజిస్ట్రేషన్​ చట్టం 2007 నవంబర్ 19, సెక్షన్​ 22ఎ(1)(ఈ) కింద నిషేధిత జాబితాలో పెట్టారు. దరఖాస్తుదారులంతా ఈ విషయంపై అప్రమత్తమై హెచ్​ఎండీఏ అధికారులను సంప్రదిస్తున్నారు. ఈ నిషేధిత జాబితాలో భూములు, లే అవుట్లు ఉంటే.. భూముల క్రయవిక్రయాల సమయంలో ఈ భూములను రిజిస్ట్రేషన్​ చేయరు. ప్రభుత్వ, ఇతర వివాదాలున్నా వాటిని ఈ జాబితాలో సర్వే నంబర్లతో సహా చేర్చుతున్నారు. ఆయా సర్వే నంబర్లలోని ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసేందుకు రిజిస్ట్రేషన్​ ముందుకు వస్తే వెంటనే అధికారులు అడ్డుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు తాజాగా పంచాయతీ లేఅవుట్లు ఈ జాబితాలో కనిపించడంతో ఆయా భూముల యజమానులంతా బెంబేత్తుతున్నారు. ఎల్​ఆర్​ఎస్​ కింద క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఈ లేఅవుట్లు తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిషేధిత జాబితాలోని లేఅవుట్ల వివరాల కోసం క్లిక్ చేయండి :

భాగ్యనగరంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు - 2028 నాటికి 34 లక్షల ఉద్యోగాలు - GCCs in Hyderabad

హైదరాబాద్​లో భారీ సొరంగాలు - వరద నియంత్రణకు జపాన్​ తరహాలో చర్యలు

Last Updated : Oct 22, 2024, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.