ETV Bharat / state

విద్యాకానుక లెక్కలతో బట్టబయలైన ప్రభుత్వ బాగోతం - పిల్లల సంఖ్య పడిపోయినా వెల్లడించని సర్కారు - Govt Schools Fallen Drastically - GOVT SCHOOLS FALLEN DRASTICALLY

Government Schools Fallen Drastically in Children: ప్రభుత్వ, ఎయిడెడ్​ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయినా వాటిని సర్కారు ఇన్నాళ్లు బయటపెట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు లక్ష్యానికి అనుగుణంగా ఉండడం లేదు. ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాల్లో కలిపి ఏటా దాదాపు 3 లక్షలకుపైగా విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి వెళ్లిపోతున్నారు. ఎనిమిదేళ్ల పిల్లలను చదువుకునేందుకు పక్క గ్రామాలకు పంపలేక తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేస్తున్నారు.

Government Schools Fallen Drastically in Children
Government Schools Fallen Drastically in Children (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 10:06 AM IST

విద్యాకానుక లెక్కలతో బట్టబయలైన ప్రభుత్వ బాగోతం - పిల్లల సంఖ్య పడిపోయినా వెల్లడించని సర్కారు (ETV Bharat)

Government Schools Fallen Drastically in Children: విద్యార్థుల లెక్కలతో ప్రభుత్వం దొంగాట ఆడుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య భారీగా పడిపోయినా ఇన్నాళ్లు బయటపెట్టలేదు. కానీ విద్యా కానుక లెక్కలతో ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటికి 3 లక్షల 59 వేల ప్రవేశాలు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్లే ఈ దుస్థితి నెలకొందని విద్యావేత్తలు చెబుతున్నారు.

బడిలో తాగటానికి నీళ్లు లేవు.. మా కోసం బటన్​ నొక్కవా జగన్​ మామయ్య

ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య: ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. విద్యా కానుక కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 2024-25 విద్యా సంవత్సరం కోసం పాఠశాల విద్యాశాఖ విద్యా కానుక కొనుగోళ్లు నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుత్తేదార్లకు ఆర్డర్‌ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు కేవలం 35 లక్షల 69 వేల మంది మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. 2023-24 సంవత్సర విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ఆర్డర్‌ ఇచ్చింది.

ఏటా క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున అదనపు కొనుగోళ్లు లేకుండా వాస్తవ సంఖ్య ప్రకారమే కొనుగోలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. వైఎస్సార్​సీపీ సర్కార్‌ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన సంస్కరణలతో బడులు అధ్వానంగా మారాయి అనడానికి తగ్గిపోయిన పిల్లల ప్రవేశాలే నిదర్శనం. 2018-19లో ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి 39 లక్షల 29 వేల మంది పిల్లలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 3 లక్షల 59 వేలు తగ్గింది. గత టీడీపీ ప్రభుత్వంతో పోల్చి చూస్తే విద్యార్థుల చేరికలు తగ్గిపోయాయి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా విద్యార్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచేది. అందరూ తెలుసుకునే వీలుండేది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున 2021 నుంచి వెబ్‌సైట్‌ నుంచి పిల్లల వివరాలను జగన్‌ సర్కార్‌ తొలగించింది.

జగన్ ప్రచార మోత, మారని బడిరాత - పూరిగుడిసెలో పాఠాలు, రేకులషెడ్డులో రాతలు

లక్ష్యానికి అనుగుణంగా లేని ప్రభుత్వ పాఠశాలలు: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలు లక్ష్యానికి అనుగుణంగా ఉండడం లేదు. ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాల్లో కలిపి ఏటా దాదాపు 3 లక్షల 91 వేల మంది విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసి వెళ్లిపోతున్నారు. ఇదే స్థాయిలో ఒకటో తరగతిలో చేరికలు ఉండడం లేదు. గత రెండు, మూడేళ్లుగా ఒకటో తరగతిలో లక్ష నుంచి లక్షన్నరకుపైగా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేటుకు అధికంగా తరలిపోతున్నారు. ఇదే పద్ధతి కొన్నేళ్లు సాగితే ప్రభుత్వ బడులు మూసివేసే పరిస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, బడుల సంఖ్యను తగ్గించేందుకు వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేసిన ప్రయోగం కారణంగానే విద్యార్థుల ప్రవేశాలు దారుణంగా పడిపోతున్నాయి.

గతంలో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు ఉండేవి. పదేళ్లు వచ్చే వరకు ఊరి బడిలోనే విద్యార్థులు చదువుకునేవారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్‌ బోధనంటూ చేసిన సంస్కరణ ప్రాథమిక విద్యను దెబ్బతీసింది. ప్రాథమిక బడుల నుంచి చాలా చోట్ల 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత బడులకు తరలించేశారు. దీంతో ఊరి బడిలో 1, 2 తరగతులే మిగిలాయి. వీటిల్లోనూ పిల్లలు తక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల మూసేశారు. ఎనిమిదేళ్ల పిల్లలను చదువుకునేందుకు పక్క గ్రామాలకు పంపలేక తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేశారు. దీంతో ఒకటో తరగతిలో ప్రవేశాలు ఉండడం లేదు.

ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్? రాష్ట్రంలో మూత'బడు'లు - చదువులకు దూరం అవుతున్న పిల్లలు

దొంగ లెక్కలతో విద్యను నాశనం చేసిన వైసీపీ సర్కార్​: ప్రభుత్వ బడుల్లో చదువుతున్న వారిలో ఎక్కువ మంది పేదల కుటుంబాలకు చెందిన వారే. వీరిలో ఎక్కువ మంది మధ్యలో చదువు ఆపేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దీన్ని బయటపెట్టడం లేదు. 2022 అక్టోబరులో గ్రామ, వార్డు సచివాలయ శాఖకు పాఠశాల విద్యాశాఖ పంపిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తరగతుల్లో కలిపి లక్షా 73 వేల 416 మంది మధ్యలోనే చదువు ఆపేసినట్లు తెలుస్తోంది. అదే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సమగ్ర శిక్షా అభియాన్‌ విభాగానికి ఇచ్చిన నివేదికలో మాత్రం 1 నుంచి 5 తరగతుల పిల్లలెవరూ బడి మానేయలేదని తెలిపింది.

ఒకవైపు ఇలా పేర్కొంటూనే 1 నుంచి 5 తరగతులకు చెందిన 66 వేల 205 మంది బడి మానేశారని, వారిని గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయాల విభాగాన్ని కోరడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి దొంగ లెక్కలతో వైసీపీ సర్కారు విద్యను సర్వనాశనం చేసింది. పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తన పరపతిని పెంచుకునేందుకు అరాచకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఐదు తరగతులు - ఒకే గది - ఇవేమీ చదువులు - Government School Problems

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.