Skill Calculation Survey in Mangalagiri : దేశంలోనే మొదటిసారి నైపుణ్య గణనను సెప్టెంబరు 3న ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. సర్వేకు వినియోగించే యాప్ రూపకల్పన దాదాపుగా పూర్తయింది. సర్వేతోపాటు అభ్యర్థులు నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచితే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు యోచిస్తున్నారు.
HOW TO CALCULATE SKILL CENSUS: నైపుణ్య గణనను సెప్టెంబరు 3న మంగళగిరిలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారు. దీంతోపాటు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే ద్వారా సమాచారం సేకరించి, విశ్లేషణ చేసేందుకు దాదాపు 8 నెలల సమయం పడుతుందని నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఈ సర్వేకు ఒక్కో గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఆరుగురు చొప్పున ఉద్యోగులను వినియోగించనున్నారు.
వీరికి ఈ నెల 23, 24, 30, 31న రెండు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం వీరు ఇంటింటికీ వెళ్లి ట్యాబ్‌ల్లో సమాచారం సేకరిస్తారు. 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈ-శ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు.
20 ఏళ్లపాటు ఉపయోగపడుతుంది : సర్వే ద్వారా సేకరించిన సమాచారం దాదాపు 20 ఏళ్లపాటు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరికి ఏ డొమైన్‌లో నైపుణ్య శిక్షణ అవసరమో గుర్తించిన అనంతరం నైపుణ్య కళాశాలలు, హబ్‌లు, కొత్తగా కళాశాలలు, వర్సిటీల్లోనూ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ తర్వాత అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. ఎలాంటి నైపుణ్యాలు కావాలో కంపెనీల నుంచి సైతం వివరాలు తీసుకుంటారు. వాటికి అనుగుణంగా శిక్షణ ఇచ్చి, ఆయా కంపెనీలకు అనుసంధానం చేస్తారు. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, కేంద్ర ప్రభుత్వ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్ సేవలను కూడా శిక్షణలకు వినియోగించుకోనున్నారు.
ఏమేం వివరాలు సేకరిస్తారు? : అక్షరాస్యులు? నిరక్షరాస్యులు? ఉద్యోగులు? చదువుకుని ఉద్యోగం రాని వారు? ఉద్యోగం సంఘటిత రంగమా? అసంఘటిత రంగమా? నిరుద్యోగుల విద్యార్హతలు? పీహెచ్ఎ, ఎంఎస్, డిగ్రీ, ఇంటర్మీడి యట్, పదో తరగతి, ఎనిమిదో తరగతి? బీటెక్ చదివితే డొమైన్ నాలెడ్జ్ ఉందా? ఇలా 25 రకాల ప్రశ్నల ద్వారా సమాచారం సేకరి స్తారు. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారి పీఎఫ్ ఖాతాలు, అసంఘటిత రంగంలో ఉంటే ఈ-శ్రమ్ ద్వారా వివరాలు తీసుకోనున్నారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census
యువతకు నైపుణ్య శిక్షణ - కూటమి ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండనుంది ? - youth skills development