ETV Bharat / state

స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులపై ప్రభుత్వం కక్షసాధింపు- జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగింపు

Government Not Paid Special Protection Officers Salaries: స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులంటే ఒకప్పుడు అందరికీ హడల్. ప్రస్తుతం ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని అడిగినందుకు ఉద్యోగాల నుంచి తీసేశారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Government Not Paid Special Protection Officers Salaries

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 5, 2024, 2:07 PM IST

Government Not Paid Special Protection Officers Salaries: అక్రమ మద్యం, ఇసుక రవాణాను అడ్డుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఉద్యోగులంటే ఒకప్పుడు అందరికీ హడల్. కోట్ల రూపాయల విలువ చేసే అక్రమ మద్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నారు. ఉన్నతాధికారుల చేత బేష్ అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు ఉద్యోగం ఇవ్వండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని అడిగినందుకు ఉద్యోగాల నుంచి తీసేశారని స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మిర్చి మొక్కల మధ్యలో గంజాయి సాగు- అరెస్టు చేసిన పోలీసులు

Losing Their Jobs Going Through Hell: మద్యం అక్రమ విక్రయాలు, రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి ఏడాది పైగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఒకప్పుడు అందరినీ తనిఖీలతో వణించిన ఎస్పీవో సిబ్బంది పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మద్యం, ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం 2020లో స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమిస్తూ జీవోను జారీ చేసింది. ఈ ఫోర్స్​లో విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, యువకులు చేరారు . దేహధారుడ్య పరీక్షలు, మెడికల్ టెస్ట్​లు ఇలా అన్నింటిలో ఉత్తీర్ణులైన 2,156 మందిని విధుల్లోకి తీసుకున్నారు. నెలకు రూ.15 వేల చొప్పున వేతనాలు ఇచ్చారు.

2022 వరకు ఎస్పీవోలుగా పనిచేస్తూ సరిహద్దుల్లో సిబ్బంది తనిఖీలు చేశారు. కోట్ల రూపాయల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక నేతల ఒత్తిడిలకు తలవంచకుండా అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు. ఎస్పీవోలకు గతంలో 11 నెలల వేతనాలను ప్రభుత్వం పెండింగ్​లో ఉంచింది. తమకు వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వారంతా కోరడంతో 2022 మార్చి నుంచి వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తూ మెమో జారీ చేశారు. పెండింగ్ వేతనాలను సిబ్బంది ఖాతాల్లో వేశారు. అప్పటి నుంచి నేటి వరకు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. తమ ఉద్యోగాలు వెంటనే ఇప్పించాలని వారంతా కోరారు. పరిశీలిస్తామని చెప్పిన సజ్జల ఇప్పుడు ఉపాధి కల్పించలేమని చేతులెత్తేశారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'టీడీపీ నేతలే లక్ష్యంగా పోలీసుల దాడులు- ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర'

విధుల నుంచి తొలగింపు: కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన తమను అన్యాయంగా తొలగించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఎస్పీవోల కాలపరిమితిని రెన్యూవల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. 2022లో సైతం రెన్యూవల్ చేసి హటాత్తుగా మార్చిలో తమ ఉద్యోగాలను తొలగించటం అన్యాయమని వాపోతున్నారు. గతంలో నిందితులుగా ఉన్న వారు తమను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. ఇతర శాఖల్లో సైతం తమకు ఉద్యోగాలు ఎవరూ ఇవ్వట్లేదన్నారు .ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగాలు ఇప్పించాలని వారంతా కోరుతున్నారు.

డమ్మీ తుపాకీతో డేంజర్​ రౌడీ- ఆటకట్టించిన విశాఖ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.