Govt Orders Increasing Scope of AP CRDA: ఏపీ సీఆర్డీఏ (Andhra Pradesh Capital Region Development Authority) పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో విలీనం చేసిన విస్తీర్ణం తిరిగి సీఆర్డీఏలో కలుపుతూ ఆదేశాలు వెలువడ్డాయి. సత్తెనపల్లి మున్సిపాలిటీ, పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కలిపిన 6 మండలాల్లోని 92 గ్రామాల 1,069 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సీఆర్డిఏలో కలవనుంది. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 562 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కూడా సీఆర్డీఏలో విలీనం అవనుంది. మొత్తంగా 1,631 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం తిరిగి సీఆర్డీఏలో కలుపుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేసారు.
ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారుకావాలి - సీఎం చంద్రబాబు క్లాస్
రాష్ట్రంలో రిలయన్స్ రూ.65 వేల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూ