ETV Bharat / state

మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ? - POLAVARAM NEW ESTIMATION AMOUNT

రూ.11,214.78 కోట్లతో తాజా పాలనామోదం - గడిచిన ఐదేళ్లలో పనులు పూర్తి చేయకపోవడంతో మళ్లీ అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

polavaram_project_main_dam_new_estimation_amount
polavaram_project_main_dam_new_estimation_amount (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 12:05 PM IST

Polavaram Project Main Dam New Estimation Amount : పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం అంచనాలను రూ.11,214.78 కోట్లకు సవరించారు. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన డ్యాంలో పరిశోధన, సర్వే, ప్రిపరేషన్‌ పనులు, డిజైన్లు, డ్రాయింగుల రూపకల్పన, ప్రధాన డ్యాం మొదటి రెండు భాగాల్లో రాతి, మట్టికట్ట నిర్మాణం, మూడో భాగంలో కాంక్రీటు డ్యాం నిర్మాణం, కాఫర్‌ డ్యాంల నిర్మాణం, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ ఛానల్, పైలట్‌ ఛానల్, స్పిల్‌ వే నిర్మాణం తదితరాలన్నీ ఇందులోకే వస్తాయి.

విద్యుత్‌ కేంద్రం నిర్మాణం కోసం చేపట్టిన పునాది పనులూ సైతం ఈ అంచనాల్లో కలుస్తాయి. ప్రధాన డ్యాంలో వరదల వల్ల కోత పడ్డ ప్రాంతంలో ఇసుకతో నింపి సాంద్రత పెంచి ఆ ఇసుక గట్టిదనాన్ని పెంచేలా పనులు చేస్తున్నారు. కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. నది రెండువైపులా గట్ల రక్షణ పనులు ఇందులోకి వస్తాయి.

పోలవరం, అమరావతి విషయంలో ఈ వేగం, చిత్తశుద్ధి గత ప్రభుత్వంలో ఏమైంది?

అప్పట్లో రూ.4,717 కోట్లు : పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం అంచనాలు 2013-14లో రూ.4,717 కోట్లుగా అంచనా వేసి పాలనామోదం ఇచ్చారు. అప్పట్లో టెండర్లు పిలిచి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థకు 14.055% తక్కువకు పనులు అప్పగించారు. ఆ టెండర్‌ డిస్కౌంట్‌ మినహాయించి రూ.4,054 కోట్లుగా లెక్కించారు. అనంతరం భూసేకరణ ఆలస్యం కావడంతో గుత్తేదారు పనులు చేపట్టడం ఆలస్యమైంది. ఈ క్రమంలో 2015 అక్టోబరు 10 నాటికి పనుల అంచనా విలువను కూడా పెంచారు. ట్రాన్స్‌ట్రాయ్‌ టెండర్‌ డిస్కౌంట్‌ను కూడా మినహాయించి అప్పటికి పని విలువను రూ.5,535.14 కోట్లకు చేర్చారు.

తర్వాత జగన్‌ ప్రభుత్వం వచ్చాక అప్పటికి మిగిలి ఉన్న పనిని మేఘా సంస్థకు అప్పజెప్పింది. రూ.1,548.12 కోట్లకు పూర్తి చేసేలా ఆ పనులు అప్పగించింది. 2021లో ప్రధాన డ్యాం పనుల అంచనాలను రూ.7,192 కోట్లకు పెంచింది. 2023లో రూ.2,022 కోట్ల అదనపు పనులకు జలవనరుల శాఖ పాలనామోదం ఇచ్చింది. గడిచిన ఐదేళ్లలో పనులు పూర్తి చేయకపోవడం, కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం, భారీ వరదకు ప్రధాన డ్యాం ప్రాంతం కోసుకుపోవడం, కాఫర్‌ డ్యాంల లీకేజీ సరిదిద్దడం వంటి పనుల వల్ల ప్రస్తుతం మళ్లీ అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు అడ్వాన్స్‌ - 75% ఖర్చు చేస్తేనే తదుపరి నిధులు

"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.