ETV Bharat / state

ఏపీలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు - ఆ ఇద్దరు డీజీపీ ఆఫీస్​కి రిపోర్టు చేయాలని ఆదేశాలు - Nine IPS Officers Transfers In AP - NINE IPS OFFICERS TRANSFERS IN AP

Government has Given Orders Transferring Nine IPS Officers in State : రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరికి మాత్రం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Government has Given Orders Transferring Nine IPS Officers in St
Government has Given Orders Transferring Nine IPS Officers in St (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 9:40 PM IST

Updated : Jul 11, 2024, 10:32 PM IST

Government has Given Orders Transferring Nine IPS Officers in State : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్​ను బదిలీ చేసింది. శాంతి భద్రతల ఐజీగా సీ.హెచ్ శ్రీకాంత్ నియమించింది. లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్​డి రామకృష్ణకు బాధ్యతలు అప్పగించగా, అలాగే పోలీసు నియామక బోర్డు చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అంజనా సిన్హాకు అప్పగించారు. విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర బాబును బదిలీ చేశారు. విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టిను నియమించారు. కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్​ను బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని విశాల్ గున్నికి, విజయరావులకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు భారీగా ఐఏఎస్​ల బదిలీ..

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్​ కుమార్ ప్రసాద్​ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఆర్‌.పి. సిసోడియా కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. జి.జయలక్ష్మి కి సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్‌ దండే ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. సురేశ్‌ కుమార్‌ ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి , గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్‌ గౌర్‌ ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువరాజ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి గా హర్షవర్ధన్‌ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పి.భాస్కర్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్‌, జీఏడీ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్​ వీఆర్‌ఎస్​కు ప్రభుత్వం ఆమోదం -సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి - IAS Praveen Prakash VRS

కె.కన్నబాబు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు అప్పగించింది. వినయ్‌చంద్‌ పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వివేక్ యాదవ్‌ యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి గా నియమించింది. సూర్యకుమారి మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సి.శ్రీధర్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. జె.నివాస్‌ ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. విజయరామరాజు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. హిమాంశు శుక్లా సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌ గా నియమించింది. ఢిల్లీరావు వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. హరీశ్‌కుమార్‌ గుప్తా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌ డీజీగా బదిలీ చేసింది. కుమార్‌ విశ్వజిత్‌ హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్‌ ఇచ్చింది. గిరిజాశంకర్‌ ను ఆర్థికశాఖ నుంచి రిలీవ్ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్​ల బదిలీ - సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశం - IAS Officers Transfer in ap

Last Updated : Jul 11, 2024, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.