New Liquor Policy 2024 in AP : రాష్ట్రంలోని మందుబాబులకు క్కిక్కెంచి వార్త ఇది. అక్టోబర్ నెల నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచాలని, ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం విధానాన్నే తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 17న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
తక్కువ ధరకే నాణ్యమైన సరుకు - నూతన మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు - Cabinet Meeting on Liquor Policy
తక్కువ ధరకు నాణ్యమైన మద్యం : గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్య విధానం రూపొందించారని తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా మద్యం విధానం రూపొందించారని వెల్లడించారు. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతిందన్నారు. అందుకోసమే నూతన మద్యం విధాన రూపకల్పనపై తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన విధానం ఉంటుందని మంత్రి తెలిపారు.
నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ నియామకం - Sub Committee on New Liquor Policy
కళ్లముందే వేలాది మద్యం సీసాలు - ఆగలేకపోయిన మందుబాబులు - DRUNKARDS LOOTED LIQUOR