ETV Bharat / state

పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోన్న జగనన్న లేఅవుట్ - మామిడి తోటలో జగనన్న లేఅవుట్లు

Government Distributed Lands In Uninhabitable Place: సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు మారాయి. చుట్టూ చెట్లు, ముళ్ల పొదల మధ్యలో నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే స్థలాలు ఇచ్చారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.22 ఎకరాల్లో 807 మంది లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో కేవలం 30 మంది మాత్రమే నిర్మించుకున్నా వాటిలో నివసించడానికి లబ్దిదారులు బయపడుతున్నారు.

Government_Distributed_Lands_In_Uninhabitable_Place

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 6, 2024, 1:31 PM IST

పిచ్చి మొక్కలతో చిట్టడవిని తలపిస్తోన్న జగనన్న లేఅవుట్

Government Distributed Lands In Uninhabitable Place: నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే స్థలాలు ఇచ్చి జనాన్ని నట్టేట ముంచుతున్నారు. జగనన్న కాలనీలో సొంతిటి కల కలగానే మిగిలిపోయింది. జగనన్న కాలనీలు మామిడి తోటల మధ్యలో ఇవ్వటంతో ముళ్ల పొదలతో నిండిపోయింది. ఈ కాలనీలోకి వెళ్లాలంటేనే ప్రజలు, లబ్దిదారులు భయాందోళనలకు గురవుతున్నారు.
Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..

ప్రభుత్వం కేటాయించిన జగనన్న లేఅవుట్లు (Jagananna Layout) లబ్ధిదారులకు అక్కరకు రావడం లేదు. నివాసయోగ్యం కాని స్థలాల్లో ఇళ్లు ఇవ్వడంతో పేదల సొంతింటి స్వప్నం కలగానే మిగిలిపోతుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కృష్ణా నది కరకట్ట కింద సుమారు 22 ఎకరాల్లో 807 మంది లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. 2021 జనవరి 18న సమావేశం ఏర్పాటు చేసి జగనన్న కాలనీలో సకల వసతులు ఏర్పాటు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే మూడు సంవత్సరాలు దాటినా లేఅవుట్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. 807 మంది లబ్దిదారులు ఉన్న లేఅవుట్లో ఇప్పటికి మట్టి రోడ్లు దర్శనం ఇస్తున్నాయి. కాలనీలోకి వెళ్లే మార్గంలో పెద్ద గుంతలు ఉండటంతో ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక, రాయి, ఇతర సామాగ్రి తరలించడానికి వాహనాలు వెళ్లలేని పరిస్థితి. కరెంట్ తీగలు ఉన్నా విద్యుత్ సరఫరా ఇవ్వలేదు. కుళాయిలు ఉన్నా నీటి సౌకర్యం లేదు. జగనన్న లేఅవుట్ మామిడి తోటలో ఉండటంతో ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు మొలిచి చిట్టడవిని తలపిస్తోంది.

సమస్యలకు నిలయాలుగా జగనన్న కాలనీలు - కనీస వసతుల్లేకుండా ఎలా ఉండాలంటూ లబ్ధిదారుల ఆగ్రహం

వర్షం పడితే ఈ మట్టి రోడ్డుపై నడవలేని పరిస్థితి. ఈ లేఅవుట్లో సుమారు 30 గృహాలు నిర్మించుకున్నా వాటిలో నివసించడానికి లబ్దిదారులు బయపడుతున్నారు. గ్రామానికి ఈ స్థలాలు దూరంగా ఉండటంతో రాత్రి సమయంలో విద్యుత్, జనసంచారం లేకపోవడం, చుట్టూ మామిడి తోటలు ఉండటంతో ఇళ్లు నిర్మించుకున్న వారు సైతం అక్కడ ఉండటానికి భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లు నిర్మాణం చేయకోకపోతే మంజూరు చేసిన స్థలాన్ని రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పటంతో అప్పులు చేసి కొందరు బేస్​మెంట్, మరికొందరు శ్లాబ్ వరకు ఇళ్లు నిర్మాణం చేసి అలాగే వదిలేశారు. రాత్రి సమయాల్లో మందుబాబులు సంచారం, అసాంఘిక కార్యక్రమాలకు ఈ ప్రాంతం అడ్డగా మారిందని ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయలు కల్పించామని చెబుతున్న ప్రభుత్వం ఈ లేఅవుట్​ను చూస్తే అర్ధం అవుతుందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ లేఅవుట్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల నిర్మాణం - నీట మునిగిన కాలనీలు, అవస్థల్లో ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.