District Special Officers : జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత హెచ్ఓడీలు, ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాల్ని, పథకాల అమలును పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది.
నియమితులైన అధికారులు వీరే...
ఎన్టీఆర్ జిల్లా - జయలక్ష్మి, ఏలూరు - శశిభూషణ్, అనంత - కాంతిలాల్ దండే, విశాఖ - సౌరభ్ గౌర్, పార్వతీపురం మన్యం - కోన శశిధర్, పశ్చిమగోదావరి - బాబు.ఏ, సత్యసాయి జిల్లా - యువరాజ్, చిత్తూరు - ఎం ఎం నాయక్,
కర్నూలు - హర్షవర్దన్, నంద్యాల - పోలా భాస్కర్, శ్రీకాకుళం - ప్రవీణ్ కుమార్, బాపట్ల - ఎంవీ శేషగిరి బాబు, అల్లూరి జిల్లా - కన్నబాబు, తిరుపతి - సత్యనారాయణ, విజయనగరం - వినయ్ చంద్, అన్నమయ్య - సూర్య కుమారి, పల్నాడు - రేఖారాణి, కాకినాడ - వీర పాండియన్, నెల్లూరు - హరికిరణ్
అనకాపల్లి - చెరుకూరి శ్రీధర్, ప్రకాశం - గంధం చంద్రుడు, కడప - కేవీఎన్ చక్రధర్ బాబు, తూర్పుగోదావరి - హరి నారాయణ, కోనసీమ - లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు, కృష్ణా - విజయరామరాజు, గుంటూరు - మల్లికార్జున నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారుల బదిలీ- మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్.తేజ్ భరత్ - IAS Officers Transfer in AP