ETV Bharat / state

మహారాజ ఆసుపత్రికి మహర్దశ - హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు - Good Facilities on Hospital

Good Facilities in Maharaja Sarvajana Hospital in Vizianagaram District : ఎంతో పేరున్న జిల్లా ఆసుపత్రి అది. గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం దాన్ని బోధనాసుపత్రిగా మార్చింది. ఆధునిక హంగులు, వైద్య నిపుణులు అందుబాటులోకి వస్తారని అందరూ భావించారు. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రికి పూర్వవైభవం వచ్చింది. పేదలకు 90శాతం వైద్య నిపుణుల సేవలు అందుతున్నాయి.

GOOD FACILITIES ON HOSPITAL
GOOD FACILITIES ON HOSPITAL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 8:45 AM IST

Good Facilities in Maharaja Sarvajana Hospital in Vizianagaram District : విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ సర్వజనాస్పత్రిని 2022 అక్టోబర్​లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బోధనాసుపత్రిగా మార్చింది. ప్రజల్లో లేనిపోని ఆశలు కల్పించింది. రోగులు మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఆధునాతన యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తాయని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితి తయారైంది. పెరిగిన రోగులకు తగ్గట్టు సౌకర్యాలు పెరగలేదు సరికదా మరింత దిగజారాయి. వైద్య పరీక్షలకు సంబంధించిన చాలా యంత్రాలూ మూలకు చేరాయి. రోగులు ప్రైవేటు ల్యాబ్‌లకు పరుగుతీసేవారు.రక్తనిధి సైతం సేవలకు దూరమైంది. కూటమి ప్రభుత్వం బోధనాసుపత్రులను మెరుగుపరిచే చర్యలకు నడుంబిగింది. 30 అంశాలను ప్రత్యేకంగా తీసుకుని అమలు చేసింది. ఫలితంగా విజయనగరం జీజీహెచ్ సేవలు మెరుగుపడ్డాయి.

ప్రైవేటు భాగస్వామ్యంతో సేవలు : మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్తమాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, పల్మనాలజీ, దంత, ఎనస్తీషియా, బయోకెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, పెథాలజీ, ఫోరెన్సిక్ ల్యాబ్, ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణులతోపాటు ప్రైవేటు భాగస్వామ్యంతో కార్డియాలజీ సేవలు అందుతున్నాయి.

విజయనగరం జిల్లా మహారాజా ఆసుపత్రికి సుస్తీ - Maharaja Sarvajana Hospital

ఆసుపత్రిలో మెరుగ్గా సేవలు : తర్వలోనే యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడీయాట్రిక్స్, కార్డియాక్‌ నిపుణులు రానున్నారు. అంతేకాదు వైద్య సేవలకు వచ్చే వారికి అన్ని రకాల పరీక్షలు చేసి పంపుతున్నారు. రక్త పరీక్షల ల్యాబ్, ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కాన్, ఎక్సరే విభాగాల వద్ద రద్దీ కనిపిస్తోంది. గతంతో పోల్చితే రిఫరెల్స్ బాగా తగ్గాయి. యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గుండె సంబంధిత శస్త్రచికిత్సల కోసం మాత్రమే విశాఖ కేజీహెచ్​కు రోగులను పంపుతున్నారు. మిగిలిన సేవలన్నీ ఇక్కడే అందుతున్నాయి.

ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital

హర్షం వ్యక్తం చేస్తున్న రోగులు : మహారాజా ఆసుపత్రి సేవలు మెరుగుపడడంపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి పక్క జిల్లాకు పరుగులు పెట్టే పని తప్పిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జీజీహెచ్‌లో ఆధునిక యంత్రాలను సమకూర్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే పంపారు. అసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, ఎమర్జెన్సీ టెక్సీషియన్లు ఇలా మరో 50మందిని త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు.

నిధుల జాప్యం - ఏజెన్సీ ప్రాంతంలో నిలిచిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం - Hospital construction Stalled

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.