Dhanteras festivities Gold Buying : ధన త్రయోదశి సుఖసంతోషాలు, సంపదను కలిగించే రోజుగా భావించి లక్ష్మీ కటాక్షం కోసం కుబేరుడు, లక్ష్మీదేవిని కొలుస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ పండుగను ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. నేడు ధన త్రయోదశిని పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లు ఎలా ఉంటాయని అనే అంశాలు తెలుసుకుందాం.
ఏటా ధన త్రయోదశి వచ్చిందంటే చాలు బంగారు నగల దుకాణాలు కళకళలాడుతుంటాయి. ఈ రోజున గ్రాము బంగారం అయిన కొంటే మంచి జరుగుతుందని సంపద వృద్ధి చెందుతుందని కొందరి విశ్వాసం. అందుకే ఏటా ధన త్రయోదశి రాగానే నగల దుకాణాల్లో కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతుంటాయి. వాస్తవానికి ఆశ్వీజ మాస అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా చెబుతుంటారు. దీనినే దంతేరాస్ అని కూడా అంటారు. ఈ రోజునకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిందని ఆమెను శ్రీ మహావిష్ణువు భార్యగా స్వీకరించిన ఇదే రోజున ఐశ్వర్యానికి అధి దేవతను చేశారని చెబుతారు. అందుకే ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని ప్రతీతి. బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొంటే మంచిదని విశ్వసిస్తారు.
దంతేరాస్ సెంటిమెంట్ : దంతేరాస్కి బంగారం కొనటం అనేక మందికి ఓ సెంటిమెంట్. అయితే ఈ సారి బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతేడాది ఇదే సమయానికి సుమారు 61వేలు ఉన్న 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు ఏకంగా రూ. 80వేలు ఉంది. అంటే ఏడాది కాలంలోనే సుమారు 20వేల వరకు బంగారం ధర పెరగింది. ఈ సారి ధన త్రయోదశికి బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్లు పడిపోవటం, అంతర్జాతీయ స్థాయిలో యుద్ధం, అమెరికా ఎన్నికల వంటి అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగటమే ప్రధాన కారణమని వివరిస్తున్నారు. రానున్న రోజుల్లో పుత్తడి ధరలు మరింత పైకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.
బడ్జెట్ తరువాత బంగారం ధరలు తగ్గుతాయా? కేంద్రం గోల్డ్ టాక్స్ తగ్గిస్తుందా?