ETV Bharat / state

క్షణక్షణం ఆందోళన రేకెత్తిస్తున్న గోదావరి ప్రవాహం- వరద గుప్పిట్లోనే లంక గ్రామాలు - GODAVARI FLOOD

Godavari Floods in Lanka Villages : గోదావరి తీరమంతా వరద గుప్పిట్లోనే చిక్కుకొని విలవిల్లాడుతోంది. కోనసీమ లంకల్లో వరద తీవ్రత మరింత పెరిగింది. రోజుల తరబడి నీళ్లలోనే రాకపోకలు సాగించలేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6,000 ఎకరాలకుపైగా ఉద్యాన పంటలు నీటిలో నానుతున్నాయి. కష్టమంతా గోదారి పాలైందని రైతులు కంటతడి పెడుతున్నరాు.

Godavari Floods in Lanka Villages
Godavari Floods in Lanka Villages (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 7:10 AM IST

Godavari Floods in AP 2024 : వరదలతో గోదావరి తీర ప్రజలు సతమతమవుతున్నారు. తగ్గినట్టే తగ్గిన వరద మళ్లీ ప్రమాదకరంగా మారింది. కోనసీమలోని లంకలు, లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గౌతమి గోదావరి తీరంలోని ఊబలంక, కొమరాజు లంక, మందపల్లి, కేదార్లంక, నారాయలంక, బడుగువానిలంక, మూలస్థానం, అంకంపాలెం ప్రాంతాలను వరద చుట్టుముట్టేసింది. అరటి, కూరగాయల తోటలు మునిగిపోయాయి.

"వరదల వల్ల పంటలన్ని మునిగిపోయాయి. మాకు చాలా నష్టం వచ్చింది. గతంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఇలానే జరిగింది. అరటి, కూరగాయలు పూర్తిగా రంగు మారిపోయాయి. పంటను మార్కెట్​కు తీసుకువెళ్తే ధర వస్తుందో రాదో తెలియని పరిస్థితి. మా కష్టమంతా గోదారి పాలైంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం." - రైతులు

Flood Effect in Andhra Pradesh : అయినవిల్లి మండలం వెదురుబీడెం కాజ్‌వేపై వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక నీటిలోనే మగ్గుతున్నాయి. నివాస గృహాలకు వరద చేరడంతో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే సత్యనారాయణ పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ముమ్మిడివరం మండలం గురజాపులంక, లంక ఆఫ్ ఠాణేలంక, కూనలంక పూర్తిగా నీటమునిగాయి. పి.గన్నవరం మండలం శివాయిలంక, నాగులంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

"మాకు రోడ్లు లేవు. వరదలు వచ్చిన ప్రతిసారి మాకు ఇదే పరిస్థితి ఎదురవుతోెంది. వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాం. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నాం. అధికారులు సక్రమంగా తాగునీరు సరఫరా చేయట్లేదు. వరద నీటిలోనే వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నాం. అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం." - లంక గ్రామాల ప్రజలు

కుక్కలవారి పేట, పల్లిపాలెం, మొండెపులంక, జొన్నలంక, బూరుగులంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిముడిలంకల్లో వరద మరింత పెరిగింది.రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని బిదొడ్డవరం, అప్పనపల్లి, టేకిశెట్టిపాలెం, అప్పనరామునిలంక, ఓఎన్‌జీసీ కాలనీ, కొత్తలంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కలెక్టర్ మహేశ్​కుమార్ రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని లంకల్లో పర్యటించారు.

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి వాసంశెట్టి : కే.గంగవరం మండలంలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి వాసంశెట్టి సుభాశ్​ పర్యటించారు. 790 బాధిత కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు. సుందరపల్లి-కూళ్ల గ్రామాల ఏటిగట్టు వద్ద ఉన్న పంట పొలాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే గోదావరి ఏటిగట్టుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దమలంక, ఆనగార్లంక, కనకాయలంక, అయోధ్య లంక గ్రామాల ప్రజలు వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

వర్షాలు తగ్గినా వీడని వరద ముంపు - నీటిలో నానుతున్న గ్రామాలు, పంటలు - Flood Effect in Andhra Pradesh

Konaseema floods effect కోనసీమవాసుల వెతలు..! ఓవైపు వరద బురద.. మరోవైపు పాములు బెడద!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.