ETV Bharat / state

ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాల' హిడెన్‌ కెమెరాల' గుట్టు - "ప్రేమకథా" చిత్రమే కారణమా? - Gudlavalleru college Enquiry Report

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 2, 2024, 2:03 PM IST

Girls hostel Hidden cameras Row : ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో తలెత్తిన వివాదం విచారణ వేగంగా సాగుతోంది. కళాశాల వసతి గృహంలో హిడెన్‌ కెమెరాల ఆచూకీ కోసం పోలీసులు, సాంకేతిక బృందం అనువు అనువు గాలిస్తోంది. ఇదే తరుణంలో సమస్యను జఠిలంగా మార్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఈనెల మూడున ప్రభుత్వానికి విచారణ బృందం నివేదిక ఇవ్వనుంది.

GUDLAVALLERU COLLEGE ENQUIRY REPORT
Girls hostel Hidden cameras Row (ETV Bharat)

Girls hostel Hidden cameras Row: ఏపీలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారన్న ప్రచారం కలకలం రేపింది. అధికారులు, కళాశాల యాజమాన్యం, పోలీసులు ఎంత వెతికినా ఎక్కడా రహస్య కెమెరాల ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కానీ విద్యార్ధుల్లో నెలకొన్న ఆందోళన తగ్గకపోగా రోజు రోజుకూ అనుమానాలు పెరుగుతూ లేనిపోని అపోహలకు దారితీస్తోంది. కాకినాడ జేఎన్‌టీయూ విభాగం శాఖా పరంగా విచారణ కూడా చేస్తోంది.

ప్రభుత్వానికి నివేదిక : ఈనెల 3న ఈ అంశంపై నివేదిక ప్రభుత్వానికి అందించనున్నారు. దాదాపు 300 వీడియోలు బయటకు వచ్చాయని ఒక విద్యార్థిని చేసిన ప్రచారం ఇంత దుమారానికి కారణమైంది. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిల మధ్య సాగిన ప్రేమ వ్యవహారం, ఆపై వారిమధ్య ఏర్పడిన పొరపొచ్చాల మూలంగానే హిడెన్‌ కెమెరాల ప్రచారం సాగిందన్న విషయాన్ని విచారణ బృందం దాదాపుగా నిర్థారించింది. గుడివాడ సీసీఎస్‌ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఎస్సై మాధురితో కలిపి ఐదుగురు బృందంతో సాంకేతిక కమిటీని విచారణ చేసింది. ఇప్పటికే బాంబు స్క్వాడ్‌లోని సాంకేతిక బృందం సోదాలు చేసి ఎలాంటి పరికరాల ఆచూకీ లేదని తేల్చారు.

ఒక స్నానాల గది షవర్‌లో ఏర్పాటు చేశారని ఒక విద్యార్థిని మరో విద్యార్థిని ఆరోపణలు చేసింది. విద్యార్ధులను విచారించినప్పుడు ఎవరూ హిడెన్‌ కెమెరాలను చూసినట్లుగానీ, వీడియోలు చూసినట్లు కానీ చెప్పలేదు. ఒకరిద్దరు విద్యార్ధులు మాట్లాడుకునేటప్పుడు తీసుకున్న స్క్రీన్‌ షాట్స్‌ మాత్రం విచారణ బృందం దృష్టికి వచ్చాయి. ఈ స్క్రీన్‌ షాట్‌ను చూసిన ఐదుగురు విద్యార్ధులు బృందంలోని ఒక విద్యార్ధి హిడెన్‌ కెమెరాలంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మిన మిగిలిన విద్యార్థులు మాత్రం ఎవరో చెబితే విన్నామని విచారణలో సమాధానం ఇస్తున్నారు.

సెలవులు పొడిగింపు : ఈ అంశంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు కళాశాల యాజమాన్యం సెలవులు ప్రకటించింది. ఈ నెల 3 వరుకు సెలవులు ఉన్నాయి. ఉద్రికత్త తగ్గే వరకు సెలవులు పొడగించాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. ఇప్పటికే ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఓ ముక్కోణపు ప్రేమకథ, ఓ ఏకపక్ష ప్రేమ వ్యవహారం ఈ ప్రచారానికి తెరతీసిందని యాజమాన్యం కూడా చెబుతుంది. అటు బాలికల వసతిగృహం సంరక్షణాధికారిణి వ్యవహారం కూడా ఈ వివాదానికి కారణం.

ఆమెకు తొలుత ఫిర్యాదు చేసిన సమయంలో తగిన చర్యలు తీసుకోకపోగా జాప్యం చేయడం ఇంత గందరగోళానికి కారణమైంది. ఆమె విద్యార్థినులనే తిరిగి బెదిరింపు ధోరణిలో హెచ్చరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. కళాశాల యాజమాన్యం ఆమెను తాత్కాలికంగా తొలగించింది. కొంత మంది విద్యార్థినులు వార్డెన్‌కు రహస్య కెమెరా దొరికిందని చెబుతున్నారు. అయితే ఆమె ఎలాంటి కెమెరా దొరకలేదని చెప్పినట్లు సమాచారం.

మరోవైపు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థినుల్లో నమ్మకం పెంచేందుకు మంత్రి, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు కళాశాలకు వెళ్లి మాట్లాడారు. దర్యాప్తు ముగిసే వరకు ఇళ్లకు వెళ్లాలని సూచించారు. ఆ మేరకు పంపిస్తుంటే కొంత మంది బస్సులకు అడ్డుపడ్డారు. ఓ మహిళా ఎస్సై దురుసుగా ప్రవర్తించడంపై సీరియస్‌ అయిన ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. మరో రెండు రోజుల్లో అసలేం జరిగిందనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాంకేతికంగా, శాస్త్రీయంగా విచారణ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

బీటెక్​ కాలేజీలో దారుణం - అమ్మాయిల​​ వాష్​రూమ్​లో హిడెన్​ కెమెరాలు - అబ్బాయిలకు వీడియోలు విక్రయం! - HIDDEN CAMERAS IN GIRLS WASHROOMS

పీజీ కాలేజ్‌ ఉమెన్స్​ హాస్టల్ స్నానాలగదిలో ఆగంతకులు - రక్షణ కోసం విద్యార్థినుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.