Girl suicide In Hyderabad : హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో యువతి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ములుగు జిల్లాకు చెందిన సాహితీ హైదరాబాద్‌లో ఎంబీఎ చదువుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఉంటూ ఆమె కళాశాలకు వెళ్తోంది. ఈ క్రమంలోనే వసతి గృహంలోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని, బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్నేహితులు, హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న యువతి ఆత్మహత్య.. విద్యార్థుల ఆందోళనతో అర్థరాత్రి ఉద్రిక్తత
Girl suicide Case : బిడ్డ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఓ యువకుడి వేధింపులతోనే తమ అమ్మాయి ప్రాణాలు తీసుకుందని సాహితీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు యువతి తండ్రి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో (Police Station) ఫిర్యాదు చేశారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తదనంతరం పూర్తి వివరాలు తెలియ జేస్తామని చైతన్యపురి పోలీసులు తెలిపారు.
'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక..
సాహితీ ఉరి వేసుకునే ముందు చివరగా చిడెం హరీశ్‌తో యువతి వీడియోకాల్ మాట్లాడిందని బంధువులు తెలిపారు. ప్రేమ పేరిట కొంత కాలంగా హరీశ్ వేధిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం చిడెం హరీశ్ యువతి ఉంటున్న హాస్టల్ వద్ద గొడవ చేశాడని ఆరోజు నుంచి తీవ్ర మానసికి వేదనకు గురైందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. బాధితుని తండ్రి మోహనరావు గతంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ దర్పంతోనే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మాట్లాడుతున్నాడని మృతురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
"జాబ్ కోసం వచ్చిన నా మేనకోడలిని ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో వేధించాడు. అసభ్యంగా మాట్లాడుతూ అన్యాయంగా ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడు. యువకుడి తండ్రికి చెబితే ఆయన ఏం చేసుకుంటారో చేసుకొండి అని దురుసుగా ప్రవర్తించాడు. చైతన్యపురి పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. నా మేనకొడలు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేలా చూడండి. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. రేపు ఏ మహిళకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకొండి."-బాల మురళీకృష్ణ, మృతురాలి మేనమామ