Gangavaram Port Contract Workers Protest Third Day: విశాఖలో గంగవరం పోర్టు కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన నిరసనలు మూడోరోజుకు చేరుకున్నాయి. వేతనాల పెంపు, డీఏ చెల్లింపులు, ప్రమాదబీమాలు కల్పించాలని విధులు బహిష్కరించి ఆందోళన బాటపట్టారు. పోర్టులో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, వైద్య సదుపాయం, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఒప్పంద కార్మికుల సమస్యలపై యాజమాన్యం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఘటనాస్థలికి సీఐఎస్ఎఫ్, పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి.
అదానీ చేతికి మరో పోర్టు - రూ.3,350 కోట్లకు డీల్ ఫిక్స్! - Adani acquire Odisha Gopalpur Port
Gangavaram port workers Demands:
- ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి డీఏను బేసిక్‌లో మెర్జ్ చేసి ఇవ్వాలి.
- అందరికి పాత సర్వీసును కొనసాగిస్తూ ఎజీపీఎల్ మార్చాలి.
- షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కాకుండా ఫ్యాక్టరీ చట్టం తీసుకురావాలి.
- పోర్టులో మరణించిన కార్మికులకు, అంగవైకల్యం చెందే కార్మికులకు తక్షణం సమగ్రమైన నష్టపరిహార ప్యాకేజీని ప్రకటించాలి. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డ్యూటీలో చనిపోయిన వారికి 40 లక్షలు, సాధారణ మరణానికి 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి.
- విశాఖపట్నం పోర్టు, స్టీల్ ప్లాంట్‌లో ప్రత్యేకంగా హాస్పిటల్స్ & మెడికల్ పాలసీ వుంది, ఇక్కడ కూడా ప్రత్యేక మెడికల్ పాలసీని ప్రవేశపెట్టాలి. మెడికల రీయింబర్స్‌మెంట్, రిఫరల్ హాస్పిటల్ సౌకర్యం ద్వారా హెల్త్ స్కీంను ప్రకటించాలి.
- డ్యూటీకి ముందు తరువాత ఒక గంట సమయం డ్యూటీ కింద ఎటువంటి యాక్సిడెంట్స్ అయిన పరిగణలోనికి తీసుకోవాలి.
- అన్ని రకాల కార్మికులకు 8 గంటలు మాత్రమే పని చేయించాలి. ఇప్పటికే రెండు సెక్షన్లులో అమలు చేస్తన్న 12 గంటల పని నుంచి 8 గంటలకు మార్చాలి.
- ప్రతీ సంవత్సరం 20శాతం బోనస్ ఇవ్వాలి.
- ప్రతీ 6 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి. చదువుకున్న వారికి వారి చదువులను బట్టి ట్రైనింగ్ ఇచ్చి వారికి ప్రోమోషన్స్ ఇవ్వాలి.
- సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలి.
- సీనియర్లకు అదనమైన ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.
- గతంలో అంగీకరించిన అంశాలను అమలు చేయాలి. యూనియన్‌కి ఆఫీస్ కేటాయించాలి.
- కాంట్రాక్టు కార్మికులకు కనీసవేతనాలు, పీఎఫ్., ఈఎస్ఐ, శెలవులు అమలు చేయాలి. కాంట్రాక్టు కార్మికులకు కనీసం వేతనం 26,000/- ఇవ్వాలి.
- పోర్టు కాంట్రాక్టు కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. డిఏ అమలు చేయాలి.
- స్టీవ్ డోర్, మోటార్ ట్రాన్స్‌పోర్టు, ఫెర్టిలైజర్స్ గొడౌన్స్ తదితర కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ గేట్ పాస్‌లు మంజూరు చేయాలి. నియామక పత్రాలు కాంట్రాక్టర్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నెలవారీ జీతాలు చెల్లించాలి. ప్రతి సంవత్సరం కాంటాక్టర్లు బోనస్ చెల్లించాలి.
- ప్రమాదభీమా సౌకర్యం కార్మికులందరికీ వర్తింపచేయాలి.
- ఈఎస్ఐ, పీఎఫ్, సెలవులు ఇతర స్టాట్యుటిరీ బెనిఫిట్స్ అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
- సబ్సిడీతో కూడిన క్యాంటీన్ సౌకర్యం కల్పించాలి.
"విశాఖ కథా చిత్రమ్"లో అడుగడుగునా అనుమానాలే! - Visakha drug case