ETV Bharat / state

ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇవి ఉండాల్సిందే - 29 నుంచి బుకింగ్స్

ఈనెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం - ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్‌-1967

Free_Gas_Cylinder_Scheme_Update
Free Gas Cylinder Scheme Eligibility (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Free Gas Cylinder Scheme Eligibility: సూపర్ సిక్స్​లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన అర్హతలను మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్​లకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్​లు పంపిణీ చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన ఉత్తర్వులను ఇస్తున్నామన్నారు.

29నే గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు: అక్టోబర్ 31 డెలివరీ రోజుగా పెట్టుకొని మొదటి ఉచిత సిలిండర్ మార్చి 31 వరకూ ఎప్పుడైనా పొందవచ్చని వెల్లడించారు. ఈనెల 29నే గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా తొలి సిలిండర్ ఇప్పిస్తామన్నారు.

అర్హతలు ఇవే:

  • ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి
  • తెల్ల రేషన్ కార్డు ఉండాలి
  • ఆధార్ కార్డు ఉండాలి

48 గంటల్లోపు ఖాతాల్లోకి డబ్బులు: 3 ఆయిల్ కంపెనీల చర్చలు జరిపామని, బుకింగ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోపే గ్యాస్ డెలివరీ పూర్తవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదే విధంగా 48 గంటల్లోపు లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని వెల్లడించారు. ఎవరికి అయినా సరే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్‌-1967 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.

కోటి 55 లక్షల కనెక్షన్‌లకు గ్యాస్‌ సిలిండర్‌లు పంపిణీ చేస్తున్నాం. ఈనెల 29నే గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్‌కు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్ ఉండాలి. గ్యాస్ కనెక్షన్‌కు తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉండాలి. ఈనెల 29 ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఈనెల 31న సీఎం చేతుల మీదుగా తొలి సిలిండర్ ఇప్పిస్తాం. 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది - నాదెండ్ల మనోహర్, మంత్రి

కాగా ఏపీలో ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్‌ చొప్పున సంవత్సరానికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నారు. తొలుత డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే, 48 గంటల్లో అకౌంట్​లో నగదు జమ అవుతాయి. ఒక్కో ఉచిత సిలిండర్​కు రూ. 900 కోట్లు చొప్పున 3 సిలిండర్లకు రూ. 2 వేల 684 కోట్లు భారం పడుతుంది.

"దీపావళి ధమాకా" ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు - కేబినెట్‌ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.