Free Gas Cylinder Distribution Scheme Started in AP: దీపం-2 పథకం ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఘనంగా ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సిలిండర్లు పంపిణీ చేశారు. టీ-కాచి గృహిణులకు అందజేశారు. కొంచెంసేపు లబ్ధిదారులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి దీపం-2 పథకం ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో తెలుగుదేశం నేత పుత్తా నరసింహారెడ్డి లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తర్వాత ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతులమీదుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుకున్నారు.
నెల్లూరు జిల్లాలో ఉచిత గ్యాస్ సిలెండర్ పండుగ ప్రారంభం అయింది. నెల్లూరులో మంత్రి నారాయణ, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రెండవ పథకం అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లాలోని కోవూరు మండల కార్యాలయం వద్ద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రారంభించారు.
"నారా వారి టీ" - స్వయంగా పెట్టి అందించిన సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పామర్రులో ఎమ్మెల్యే కుమార్‌రాజా లబ్ధిదారు ఇంటికి నేరుగా సిలిండర్ మోసుకువెళ్లి అందించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యాన్‌ను జెండా ఊపి ప్రారంభించి, తర్వాత లబ్ధిదారులకు అందజేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది. కలెక్టర్ చామకూరు శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, టీడీపీ నేత మండపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి దీపం-2 పథకాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో కలెక్టర్ వినోద్ కుమార్ లబ్ధిదారులకు ఉంచి గ్యాస్ సిలిండర్లు అందించారు. రాయదుర్గంలోని 17వ వార్డులో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఉచితంగా గ్యాస్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దీపం-2 పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రారంభించారు.
"ఆ ఉపాధ్యాయురాలికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాం- నీకూ అదే గతి పడుతుంది" - మాజీ మంత్రిపై మహిళ ఫిర్యాదు