ETV Bharat / state

ఏపీలోని మహిళలకు గుడ్ ​న్యూస్ - ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ డేట్ ఫిక్స్? - Free Bus for Women in AP - FREE BUS FOR WOMEN IN AP

Free Bus for Women in AP : ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలుకు తేదీ దాదాపు ఖరారయ్యింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు సమాచారం.

Free Bus for Women
Free Bus for Women in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 3:20 PM IST

Free Bus for Women in AP : ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక కసరత్తు చేస్తున్నారు. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మహిళలకు ఆ వార్త రానే వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.