Four People Injured in Clash During Devi Navratri Festival at East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలోని దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఘర్షణ జరిగింది. విజయదశమి సందర్భంగా కోలాటం జరుగుతుండగా అదే దారిలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి దారి ఇవ్వమని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
దారి కోసం కొట్లాట : పూర్తి వివరాల్లోకి వెళ్తే, విజయదశమి సందర్భంగా నిడదవోలు మండలం లింగంపల్లిలో నీలాలమ్మ గుడి వద్ద చిన్న పిల్లల కోలాటం ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు పెద్దలు కోలాటంలో పాల్కొన్నారు. ప్రజలంతా కోలాటాన్ని చూస్తూ నిమగ్నమయ్యారు. అదే సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న సునిల్ అనే వ్యక్తి దారి ఇవ్వాలని అడిగారు. అయితే అక్కిడి వారు కోలాటం జరుగుతుంది కొద్దిసేపు ఆగాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన సునీల్ వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే అక్కడున్న వారికి సునీల్‌కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
నలుగురిపై కత్తిలో దాడి : కోపం పెంచుకున్న సునీల్ అతని సోదరుడు అనిల్‌తో పాటు మరో వ్యక్తిని కోలాటం జరుగుతున్న చోటుకు తీసుకువచ్చాడు. అనంతరం అక్కడి వారిని కత్తితో దాడిచేయడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే తెరుకున్న స్థానికులు గాయపడ్డ కాకర్ల పుట్టయ్య , కాకర్ల శ్రీనివాస్, కాకర్ల ప్రవీణ్ , మీసాల శ్రీనును నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. దాడి చేసిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
"లింగంపల్లిలో నీలాలమ్మ గుడి వద్ద కోలాటం జరుగుతుండగా అదే దారిలో వెళ్తున్న సునీల్ అనే వ్యక్తి దారి ఇవ్వమని అక్కడి వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం సునీల్ అతని సోదరుడితో వచ్చి కత్తితో నలుగురిపై దాడి చేశారు. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతానికి దాడి చేసిన వారు పరారీలో ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం." - వి. శ్రీనివాసరావు, నిడదవోలు సీఐ
దేవీ నవరాత్రుల నుంచి దీపావళి వరకు- ఆశ్వయుజ మాసంలో పండగలే పండగలు! - Ashwayuja Masam 2024