ETV Bharat / state

రోడ్డుపై పెద్దిరెడ్డి పెత్తనం - ప్రజలు తిరగకుండా గేట్లు - ap ex mini Peddireddy Occupied Road - AP EX MINI PEDDIREDDY OCCUPIED ROAD

Peddireddy Occupied Road at Tirupati in AP: ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి నగర నడిబొడ్డున తన ఇంటి సమీపంలో నగరపాలక సంస్థ నిధులతో నిర్మించిన రహదారిని ఆయన ఆక్రమించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రహదారికి అడ్డంగా గేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Ex Minister Peddireddy Ramachandra Reddy Occupied Road in AP
Ex Minister Peddireddy Ramachandra Reddy Occupied Road in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 2:42 PM IST

Ex Minister Peddireddy Occupied Road in Tirupati : ఏపీలోని తిరుపతి నగరవాసుల విజ్ఞప్తితో నగరపాలక సంస్థ నిధులతో మఠం భూముల్లో నిర్మించిన రహదారి నాలుగు సంవత్సరాలు గడచినా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. 18వ డివిజన్‌ పరిధిలోని మారుతీ నగర్‌ - రాయల్‌ నగర్‌ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు 2 కిలోమీటర్ల మేర దూరం తగ్గిపోనుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటి ముందు సామాన్య ప్రజలు రాకపోకలు సాగించకూడదంటూ రెండు వైపులా పెద్ద గేట్లు ఏర్పాటు చేశారు.

స్థానికుల విజ్ఞప్తితో రహదారి నిర్మిస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు రోడ్డు మాత్రం ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. రాయల్‌ నగర్‌ నుంచి మారుతీ నగర్‌కు కొత్త రోడ్డు ద్వారా దాదాపు 300 మీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. కొత్తదారి అందుబాటులో లేక కిలోమీటరుకు పైగా చుట్టుకుని ప్రజలు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి తలెత్తింది.

వైఎస్సార్సీపీకి షాక్ ​- పార్టీని వీడుతున్న పలువురు నేతలు - YS Jagan on Leaders Migration

వెలుగులోకి పెద్దిరెడ్డి అక్రమాలు : ప్రజానిధులతో నిర్మించిన రహదారిలోకి కేవలం పెద్దిరెడ్డి అనుచరుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మఠం భూములను ఆక్రమించడమే కాకుండా నగరపాలక నిధులతో నిర్మించిన రహదారిని సామాన్య ప్రజలు వెళ్లకుండా గేటు పెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం కోల్పోవడంతో పెద్దిరెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆక్రమణలు తొలగించాల్సిందేనని జనసేన నాయకులు ఆందోళన : గురువారం జనసేన నేత కిరణ్‌ రాయల్‌ ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. ఆక్రమణలు తొలగించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు నచ్చజెప్పడంతో జనసేన నాయకులు వెనక్కి తగ్గారు. మాజీ మంత్రి ఏర్పాటు చేసిన గేట్లను తొలగించి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని నగరవాసులు కోరుతున్నారు.

గేట్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలి : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలపై ఎన్టీఏ పార్టీల నేతలు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కమిటీ వేసి రహదారి నిర్మాణం, గేట్ల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని నగరపాలక కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ బిల్లుల గోల భరించలేక జగన్ జంప్ - భార్యతో బెంగళూరుకు పయనం - JAGAN BENGALURU TOUR NEWS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.