ETV Bharat / state

వ్యాఘ్రాల ఏకాంత సమయం ఎప్పుడు?- భంగం కలిగితే ఏమవుతుంది! - NO ENTRY IN NALLAMALA FOREST

Prohibition in Nallamala Area : ఈ మూడు నెలలు పులులకు సంతానోత్పత్తి సమయం. ఈ తరుణంలో అటవీ ప్రాంతంలో జన సంచారం వల్ల వాటి ఏకాంత సమయానికి ఇబ్బంది కలుగుతుందని అటవీ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లమలలోకి ప్రవేశంపై అటవీశాఖ నిషేధం విధించింది.

People No Entry in Nallamala Forest
People No Entry in Nallamala Forest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 12:39 PM IST

People No Entry in Nallamala Forest : జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వ్యాఘ్రాలకు ఏకాంత సమయం. ఈ మూడు నెలలు పులులు జత కట్టే కాలం. అటవీ ప్రాంతంలో జన సంచారం కారణంగా వాటి ఏకాంతానికి భంగం వాటిల్లుతోంది. ఇది వాటి సంతానోత్పత్తిపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉన్న పులుల సంరక్షణ కేంద్రాల్లో మూడు నెలలపాటు జన సంచారాన్ని నిషేధిస్తున్నారు. ఇందులో భాగంగా నల్లమలలోనూ నిషేధం అమలు కానుంది.

ఆగస్టు నుంచి పూర్తి నిషేధం : నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) ఆదేశాల మేరకు తెలంగాణలోని ఆమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోకి ప్రజల ప్రవేశాలపై నిషేధించారు. వ్యాఘ్రాల పునరుత్పత్తి సమయం కావడంతో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాల సందర్శన, సఫారీలను నిలిపేశారు. మన నల్లమలలో ప్రస్తుతం జన సంచారంపై ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఇతర కార్యకలాపాలను ఆగస్టు నెల ఒకటి నుంచి పూర్తిగా నిషేధించనున్నారు.

ఈ మూడు నెలలే కీలకం : నాగార్జునసాగర్‌-శ్రీశైలం పులుల అభయారణ్యం పరిధిలో 75 పులులు ఉన్నట్లు 2022 గణనలో నిర్ధారించారు. 2024 సాధారణ గణనలో నల్లమలలో 80 వ్యాఘ్రాలు ఉన్నట్లు వెల్లడైంది. పెద్ద పులులు జులై నుంచి సెప్టెంబర్ నెల మధ్య సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఆ సమయంలో ప్రశాంత వాతావరణంతో పాటు ఏకాంతాన్ని కోరుకుంటాయి. నీటి వనరులున్న ప్రాంతంలో సేదతీరుతాయి. అడవిలో ఏ చిన్న అలజడి అయినా అవి బెదిరిపోతాయి.

ఆడ, మగ పులుల ఏకాంతానికి కొన్ని రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. గర్భధారణ సమయం 16 వారాలు. పులి సంతానోత్పత్తి కాలం 93 నుంచి 112 రోజులు. పులి పిల్లలు పెద్దవైనా 2 నుంచి 2.5 ఏళ్ల వయసొచ్చే వరకు తల్లిని వదిలిపెట్టవు.

అనుమతులు రావాల్సి ఉంది : పెద్ద పులుల సంతానోత్పత్తికి వర్షాకాలం అనుకూలంగా ఉంటుందని ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా తెలిపారు. నల్లమలలో జన సంచారంపై నిషేధాజ్ఞలకు సంబంధించి నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్టీసీఏ) నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం అడవిలోకి సాధారణ జనం ప్రవేశించకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. పులులకు ఏకాంతం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని ఇందుకు ప్రజలు సహకరించాలని సాయిబాబా విజ్ఞప్తి చేశారు.

Chenchus life style in Nallamala : నల్లమలలో ఒకరోజు.. గిరిపుత్రులతో గడిపేద్దాం రండి

NALLAMALA FOREST: అందాల నల్లమల.. జీవవైవిధ్యంతో కళకళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.