ETV Bharat / state

అన్న క్యాంటీన్ల వెనుక ఆసక్తికరమైన అంశాలు - Anna Canteens Food Supply Contract - ANNA CANTEENS FOOD SUPPLY CONTRACT

Food Supply Contract for Anna Canteens to Akshayapatra Foundation: అన్నార్తుల ఆకలి తీర్చుతోన్న అన్న క్యాంటీన్ల వెనుక అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. పేదలకు మూడు పూటలా నాణ్యమైన భోజనం అందించే బాధ్యతను ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్​కు అప్పగించింది. ఒకేసారి వేలాది మందికి భోజనం ఎలా తయారుచేస్తారు..? అన్న క్యాంటీన్లకు ఎలా తరలిస్తారు..? దీని వెనుక ఉన్న ఆంశాలను తెలుసుకుందాం..

anna_canteens_food_supply_contract
anna_canteens_food_supply_contract (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 4:37 PM IST

Updated : Aug 17, 2024, 10:38 PM IST

Food Supply Contract for Anna Canteens to Akshayapatra Foundation: అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు నాణ్యమైన ప్రమాణాలతో ఆహారం అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. ఆ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించే అవకాశాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరేకృష్ణ హరేరామ మూమెంట్‌కు అప్పగించారు. వీరు ఇప్పటికే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక ఆహారం అందిస్తున్నారు. ఇదే అనుభవంతో అన్న క్యాంటీన్లకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న వంటశాల నుంచే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 38 అన్న క్యాంటీన్లకు భోజనం పంపిస్తున్నారు.

అన్న క్యాంటీన్లకు సంబంధించి సోమవారం నుంచి శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార పట్టిక రూపొందించింది. ఈ పట్టిక ప్రకారమే అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం తయారు చేస్తుంది. అల్పాహారం కింద ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్‌, చట్నీ, సాంబార్‌, కుర్మాను క్యాంటీన్లకు అందిస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి అన్నంతోపాటు కూర, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి అందిస్తారు. ఒక్కో క్యాంటీన్​కు అల్పాహారం 350 పేట్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం 350 ప్లేట్ల చొప్పున సరఫరా చేయాలి. మెుత్తంగా రోజుకు దాదాపు 40 వేల మందికి శుచికరైన భోజనాలు సిద్ధం చేస్తారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలను బయటకు తీస్తున్నాం: మంత్రి లోకేశ్​ - Nara Lokesh Opened Anna Canteens

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనలు పాటించే వ్యాపారుల నుంచే నాణ్యమైన ముడిసరకులు కొనుగోలు చేస్తారు. సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ విధానం ప్రకారం పనిచేసే అధునాతన మిషన్లు వినియోగించి ఆహారం తయారు చేస్తున్నారు. అన్నం ఉడకడం నుంచి వాటిని పాత్రల్లో నింపడం కూరగాయలు తరగడం ఇలా ప్రక్రియ మొత్తం మిషన్ల సాయంతోనే సాగుతోంది. రుచికి ప్రాధాన్యత ఇచ్చేలా స్టెయిల్ లెస్ స్టీల్ పాత్రల్లో వంటకాలను తయారు చేయడం అక్షయపాత్ర వంటశాలల ప్రత్యేకత. క్యాంటీన్లన్నింటికీ ఆహారాన్ని సరఫరా చేసేందుకు నిర్వాహకులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తారో వినండి.

మూడుపూటలా రుచికరమైన వేడివేడి భోజనం పెట్టడం పట్ల అన్నార్తుల కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. ఇంటి భోజనం చేసినంత హాయిగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరి, గుడివాడ, ఏలూరు ప్రాంతాల్లో అక్షయపాత్ర వంటశాలలు ఉన్నాయి. త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ వంటశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు రుచికరమైన భోజనం అందించటమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 2వేల 500 మందికి ఉపాధి లభిస్తుందని అక్షయపాత్ర ఫౌండేషన్ వంటశాల నిర్వాహకులు చెబుతున్నారు.

అన్న కాంటీన్లలో వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుంది: అక్షయ పాత్ర ప్రెసిడెంట్ - Akshaya Patra Foundation

రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన 'అన్న క్యాంటీన్లు' - government launch 100 Anna Canteens

Last Updated : Aug 17, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.