Food Safety Officers Checking in Secunderabad : ప్రస్తుతం ఉన్న బిజీకాలంలో మనిషి ఆహారంపై ప్రత్యేక దృష్టిని పెట్టలేకపోతున్నాడు. పార్టీలు, ఉద్యోగ జీవితం, టైంపాస్ చేయడం వంటి అనేక కారణాల వల్ల బయట ఆహారం తినడానికే చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే టెస్ట్ పరంగా రుచిగా అనిపిస్తాయి. ముఖ్యంగా బిర్యానీలు, చికెన్ కూరలు, మటన్ కూరలు, ఐస్‌క్రీమ్‌లు అంటూ ఫాస్ట్ ఫుడ్ కోసం పాకులాడుతున్నారు. కానీ వాటన్నింటిని తినేందుకు వెళ్లే హోటళ్లు, రెస్టారెంట్లు పరిశుభ్రంగానే ఉంటాయి. కానీ ఒకసారి అవి వండే పాకశాలకు వెళ్లి చూస్తే అసలు నిజం బయటపడుతుంది.
వాటిలో ఎక్కడా పరిశుభ్రం లేని పాత్రలు, కల్తీ వంట సామాగ్రి, కుళ్లిపోయిన కూరగాయలు, పాడైపోయిన పండ్లు, వాడేసిన వంట నూనె మళ్లీ వాడడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటివి చూస్తే ఇక ఎవరైనా వాటిని తినడానికి సాహసం చేస్తారా? ఇలాంటివి తింటే మనిషికి ఉన్న 60 ఏళ్ల కాలం కాస్త ముందే వస్తుంది జాగ్రత్త! ఈ మధ్యకాలంలో నగరంలో చాలా చోట్ల ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేసి ఇలాంటి విషయాలను ఎన్నో వెలుగులోకి తీసుకువస్తున్నారు.
పాడైపోయిన పండ్ల రసాలతో జూస్ : తాజాగా సికింద్రాబాద్‌లోని అల్వాల్, లోతుకుంట, జొన్నబండ, తుర్కపల్లి ప్రాంతాల్లో ఉన్న పండ్ల దుకాణాలు, అక్రమ ధనియాల పొడి తయారు చేస్తున్న కేంద్రాల్లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు నిర్వహించారు. లోతుకుంటలో పండ్ల దుకాణంలో పాడైపోయిన పండ్ల నుంచి పండ్ల రసాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే వాటిని ధ్వంసం చేసి దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. అలాగే తుర్కపల్లిలో లేబులింగ్ లేకుండా తయారు చేస్తున్న ధనియాల పొడిని స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రత అధికారులు దుకాణాలను సీజ్ చేయడంతో పాటు దుకాణదారులపై కేసును నమోదు చేశారు.
ప్రముఖ హోటళ్ల వంట గదుల్లో దుర్గంద వాసన : ముఖ్యంగా రాజధానిలో కల్తీ ఆహారానికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. బుధవారం ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో సోమాజిగూడలోని క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్, కేఎఫ్‌సీలలో అనేక సమస్యలు బయటపడ్డాయి. వంట గదుల్లో దుర్గంధం వెలువడడం, కల్తీ ఆహార పదార్థాలు, వడ్డించే గిన్నె శుభ్రం చేయని హోటళ్లు, రెస్టారెంట్లును గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులేని సంస్థల పేరుతో తయారైన ఆహార పదార్థాలు వండుతున్నారని చెప్పారు. రిఫ్రిజిరేటర్లలలో ప్యాకింగ్ లేకుండా మాంసాహారాన్ని నిల్వచేయడం, నాసిరకం మసాలాలు వాడుతున్నారని వాటన్నింటిని వెంటనే ధ్వంసం చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
adulterated hyderabad biryani : బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!