ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద ఉద్ధృతి- నీటి విడుదల కొనసాగింపు - PRAKASAM BARRAGE FLOOD - PRAKASAM BARRAGE FLOOD

Flood Level Decrease in Prakasam Barrage: భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో జలాశయం అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.

PRAKASAM BARRAGE FLOOD DECREASE
PRAKASAM BARRAGE FLOOD DECREASE (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 6:56 PM IST

Flood Level Was Decreasing in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద ప్రస్తుతం 3.43 లక్షల క్యూసెక్కులుగా వస్తుంది. బ్యారేజీ 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు 202 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. మరో 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీఎంసీల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌ వద్ద నీటిమట్టం 11.5 అడుగులు ఉంది. గురువారం మళ్లీ ప్రకాశం బ్యారేజికి 5.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తుంది. ఈ నెల 8 నాటికి వరద ఉద్ధృతి 3 లక్షల క్యూసెక్కులకు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద స్పల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి - 11.14 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్​ఫ్లో - WATER FLOW IN PRAKASAM BARRAGE

Srisailam Project Gates Was Closed : ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో జలాశయం అన్ని గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ పరిహవాక ప్రాంతం జురాల ప్రాజెక్టు నుంచి 1,27,232 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 15, 717, హంద్రీనీవా నుంచి 250 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 68, 414 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం ప్రస్తుతం 883.90 అడుగులు, నీటి నిల్వ 215. 80 టీఎంసీలుగా నమోదైంది.

Flood Flow Will Increase of Godavari River : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 44.1 అడుగులు ఉంది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఇన్‌ ఫ్లో, ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. వరద ప్రభావిత 6 జిల్లాల అధికారులను విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.