Fire Cracker Burst from the Bike and Exploded in Eluru : దీపావళి పండుగ రోజున ఏలూరులో విషాదం నెలకొంది. స్కూటీపై బాణసంచా తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి బైక్‌పై ఉన్న వ్యక్తి శరీరం ఛిద్రమైంది. ఏలూరు తూర్పువీధి ప్రాంతంలోని గౌరీదేవి ఆలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. సుధాకర్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి పెద్దఎత్తున టపాసులు కొనుగోలు చేసి స్కూటీపై తరలిస్తుండగా ప్రమాదం జరిగింది.
పేలుడు ధాటికి ఛిద్రమైన శరీరభాగాలు : బాణాసంచా పేలుడు ధాటికి సుధాకర్ శరీరం ఛిద్రమైంది. మాంసపు ముద్దలు పక్కనే ఉన్న ఇళ్లపై, దాదాపు 100 మీటర్ల దూరంలో పడ్డాయి. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో రోడ్డు పక్కనే నిల్చుని మాట్లాడుకుంటున్న మరో ఐదుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో బాణసంచా పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ ఇంటి కిటికి అద్దాలు ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కలున్న వాహనాలు దెబ్బతిన్నాయి. భారీ శబ్ధం, చుట్టూ పొగతో స్థానికులు అయోమయానికి లోనయ్యారు. తేరుకుని ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపారు.
వివిధ కోణాల్లో దర్యాప్తు : కేవలం టపాసుల పేలుడికి ఇంత శక్తి ఉండదని పోలీసులు చెబుతున్నారు. నిపుణుల బృందం దర్యాప్తు జరుపుతోందని వెల్లడించారు. గోనె సంచిలో కేవలం మందుగుండు సామగ్రి మాత్రమే ఉందా లేక గనుల్లో ఉపయోగించే జిలెటెన్ స్టిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి పార్థసారథి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాణసంచా రవాణాపైనా పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు.
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 8 మందికి గాయాలు - Blast in Fire Crackers Factory
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు : ఇలాంటి ఘటనే నిన్న (బుధవారం) తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. అకాల వర్షంతో పాటు పిడుగు పడి బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పులు ఎగిసిపడి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మండలం పసలపూడి గ్రామ పరిధిలోని పొలాల మధ్య దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేసే కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో ఒక పురుషుడు, ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సాయంత్రం సమయానికి భారీ వర్షంగా మారింది. వర్షంతో పాటు పిడుగు పడగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
థియేటర్లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్- భయంతో ప్రేక్షకుల పరుగులు
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - దంపతులు మృతి - BLAST IN CRACKERS COMPANY