ETV Bharat / state

విశాఖ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం - భారీగా ఎగిసిపడిన మంటలు - FIRE ACCIDENT IN VISAKHA SBI OFFICE

విశాఖ రెడ్నం గార్డెన్స్‌లోని ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం

Fire Accident in Visakha SBI Office
Fire Accident in Visakha SBI Office (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2024, 10:10 AM IST

Updated : Oct 31, 2024, 1:00 PM IST

Fire Accident in Visakha SBI Office : విశాఖ రెడ్నం గార్డెన్స్‌లోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఫైర్​ సిబ్బంది అక్కడికి చేరుకున్న సిబ్బంది నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పివేశారు.

సత్వరమే స్పందించడంతో మంటలు వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. కిటికీలు పగులగొట్టి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో కంప్యూటర్లు, ఫర్నిచర్, దస్త్రాలు దగ్ధమయ్యాయి. మంటలు అదుపులోకి వచ్చినా పొగ మాత్రం వదల్లేదు. దట్టమైన పొగతో చుట్టుపక్కల ప్రజలు అవస్థలు పడుతున్నారు. లాకర్‌లోకి మంటలు వెళ్లలేదని డబ్బు భద్రంగానే ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాఖ ఎస్‌బీఐ బ్యాంకులో అగ్నిప్రమాదం - భారీగా ఎగిసిపడిన మంటలు (ETV Bharat)

విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - లక్షల్లో ఆస్తి నష్టం - Rajam Fire Accident Today

Last Updated : Oct 31, 2024, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.