ETV Bharat / state

హెర్బల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - సురక్షితంగా కాపాడిన అగ్నిమాపక సిబ్బంది - ఒకరికి గాయాలు - Fire accident - FIRE ACCIDENT

Fire accident : రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద అలెన్‌ హెర్బల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 50 మంది కార్మికులు ఉండగా ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఒక కార్మికుడు కిటికీలోంచి కిందకు దూకడంతో గాయాలయ్యాయి.

Fire accident in herbal Company
Fire accident
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 5:38 PM IST

Updated : Apr 26, 2024, 10:46 PM IST

Fire accident in herbal Company : రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద అలెన్‌ హెర్బల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. హెర్బల్‌ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారు. దీంతో భయాందోళనకు గురైన పలువురు కార్మికులు కిటికీల్లోంచి దూకి తప్పించుకున్నారు.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం పై అంతస్థులో చిక్కుకున్న కార్మికులందరిని నిచ్చెన ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు. ఒక కార్మికుడిని తరలించే లోపే మంటల ధాటికి భయపడి కిటికీలోంచి కిందకు దూకడంతో గాయాలయ్యాయి. అతనికి చికిత్స నిమిత్తం షాద్​నగర్​ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెంటనే డీఆర్​డీఎల్​ హాస్పిటల్​కు తరలించారు. ఘటనా స్థలానికి డీసీపీ నారాయణరెడ్డి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో ప్రాణనష్టం ఏం జరగలేదని డీసీపీ తెలిపారు. ఆస్తినష్టం గురించి విచారణ జరుపుతున్నామని తెలిపారు.

'నందిగామ గ్రామంలో 2 ఎకరాల్లో అలెన్‌ హెర్బల్‌ పరిశ్రమ ఉంది. ఇక్కడ దాదాపు 70 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో పరిశ్రమలో వెల్డింగ్​ వర్క్​ చేస్తుండగా దాని నుంచి నిప్పులు థర్మకోల్​ రబ్బర్​ ప్రొడక్ట్స్​ మీద పడింది. దీని వల్ల మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు లోపల చిక్కుకున్నారు. వాళ్లను కూడా కాపాడాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు'- నారాయణరెడ్డి, డీసీపీ

కార్మికుల ప్రాణాలు కాపాడిన చిన్నోడు

పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ బాలుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి కార్మికుల ప్రాణాలు కాపాడాడు. రంగారెడ్డి జిల్లా నందిగామకు చెందిన సాయిచరణ్​ వెంటనే అప్రమత్తమై భవనంపైకి ఎక్కి తాడు కట్టాడు. దీంతో చాలా మంది కార్మికుల రోప్​ సాయంతో బయటపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఈ బాలుడు తెలివిగా వ్యవహరించారని, కార్మికుల ప్రాణాలు కాపాడిన రియల్​ హీరో అంటూ పోలీసు అధికారులు సైతం అభినందించారు.

'మంటలు ఒక్కసారిగా వచ్చేసారికి ఒక వెల్డర్​ వచ్చి ఎమర్జెన్సీ ఫైర్​ సేఫ్టీ పరికరం(fire extinguisher) తీసుకుని వెళ్తున్నారు. ఏమైంది చూసేసరికి మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడున్న వాళ్లందరం కిందకు వచ్చాం. వెల్డింగ్​ వర్క్​ చేస్తుండగా నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం జరిగింది. ఒకరు పైఅంతస్తు నుంచి కిందకు దూకారు. ఆయనకు దెబ్బలు తగిలాయి'- కార్మికుడు

హెర్బల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం - సురక్షితంగా కాపాడిన అగ్నిమాపక సిబ్బంది - ఒకరికి గాయాలు

నడుస్తున్న కారులో చెలరేగిన మంటలు - అప్రమత్తతతో ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ - fire accident in rajendranagar

Last Updated : Apr 26, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.