ETV Bharat / state

మలక్‌పేట మెట్రో స్టేషన్‌ దగ్గర అగ్ని ప్రమాదం - 5 వాహనాలు దగ్ధం - FIRE ACCIDENT AT MALAKPET METRO

మలక్‌పేట మెట్రో పిల్లర్ నెంబర్‌ 1409 వద్ద అగ్నిప్రమాదం - పార్క్‌ చేసిన 5 బైకులు దగ్ధం

fire_accident_at_malakpet_metro
fire_accident_at_malakpet_metro (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2024, 5:06 PM IST

Updated : Dec 6, 2024, 6:27 PM IST

Fire Accident at Malakpet Metro Station in Hyderabad: హైదరాబాద్​లోని మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన 5 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. వాహనాలకు మంటలు అంటుకుని పొగ దట్టంగా వ్యాపించింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మలక్‌పేటలోని మెట్రో పిల్లర్ నెంబర్‌ 1409 వద్ద ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మలక్‌పేట - దిల్‌సుఖ్‌నగర్‌ మధ్య రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది.

చలి కాలంలో డ్రైవింగ్​ - ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

సంధ్య థియేటర్‌ ఘటన - ఎన్​హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు

Last Updated : Dec 6, 2024, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.