ETV Bharat / state

రామోజీరావు చిత్రపరిశ్రమకు చేసిన సేవ మరువలేనిద-సంస్మరణ సభలో సినీ ప్రముఖులు - Ramoji Rao Memorial Program

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 8:52 PM IST

Updated : Jun 27, 2024, 10:15 PM IST

Film Celebrities at Ramoji Rao Memorial Program: భారత రత్న ఇవ్వటం సబబని నిర్మాత రాజమౌళి అభిప్రాయపడ్డారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Film_Celebrities_at_Ramoji_Rao_Memorial_Program
Film_Celebrities_at_Ramoji_Rao_Memorial_Program (ETV Bharat)

Film Celebrities at Ramoji Rao Memorial Program: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, రాజకీయ దిగ్గజాలతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు రాజమౌళి రామోజీరావుకు భారతరత్న ఇవ్వడం సముచితం, సబబు అని అన్నారు. తెలుగువారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన ఆయనకు మనమేం చేయగలమని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.

Music Director M.M Keeravani: రామోజీరావులా ఒక్కరోజు జీవించినా చాలని సినీ సంగీత దర్శకుడు కీరవాణి వ్యాఖ్యానించారు. రామోజీరావు సంగీత దర్శకుడిగా తనకు జన్మనిచ్చారని, తమ దేవుడి గదిలో రామోజీరావు గారి ఫొటో ఉంటుందని కీరవాణి తెలిపారు. రామోజీరావుపై ఆరోపణలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేయడమేనని అన్నారు. బీష్ముడి మాదిరిగానే ఆయన మరణం ఉందని, మరణించినా రామోజీరావులాగే మరణించాలని కీరవాణి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని కబంధ హస్తాల నుంచి విడిపించి రామోజీరావు సంతృప్తిగా కళ్లు మూశారని వ్యాఖ్యానించారు.

నమ్మిన విలువల కోసం రామోజీరావు కట్టుబడ్డారు: హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్‌. రామ్‌ - N Ram Comments on Ramoji Rao

Producer Shyam Prasad Reddy: కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టి తన జీవితాన్ని తానే రాసుకున్న వ్యక్తి రామోజీరావు అని నిర్మాత శ్యామ్​ప్రసాద్ రెడ్డి అన్నారు. రామోజీరావు నిజమైన మానవతావాది అని, ఆయన నీడలో 40 వేల కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. రామోజీరావు దగ్గరకు తన కుమార్తెను ఓసారి తీసుకెళ్లగా కష్టపడి పనిచేసి పైకి రావాలని ఆమెకు సూచించినట్లు శ్యామ్​ప్రసాద్ రెడ్డి చెప్పారు. సమాజంలో మార్పు కోసం కలాన్ని ఆయుధంగా వాడిన రామోజీరావు లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి చాలా అరుదుగా ఉంటారన్నారు.

Actor Murali Mohan: మరణించినా ప్రజల హృదయాల్లో బతికుండే వ్యక్తి రామోజీరావు అని నటుడు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రామోజీరావు నిరూపించారని నటుడు మురళీమోహన్ వ్యాఖ్యానించారు. రామోజీరావు మీడియా, ఆర్థికరంగంలో తనదైన ముద్ర వేశారని చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులు సైతం దివాలా తీసిన ఈ రోజుల్లోనూ మార్గదర్శిని విజయవంతంగా నడుపించగలిగారని కొనియాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చి అనేక రంగాల్లో రాణించిన ఆయన సినీరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రామోజీరావు ఎందరో చిన్న నటులకు అవకాశం ఇచ్చారని, సమాజాన్ని జాగృతం చేసే చిత్రాలు తీయాలని అనేవారని తెలిపారు.

Actress Jayasudha: రామోజీరావు ఓ లెజెండ్ అని, ఆయన తెలుగువాడుకావడం మన అదృష్టమని సినీనటి జయసుధ అభిప్రాయపడ్డారు. అలాంటి మహనీయుడి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. రామోజీరావు ఒక ఎన్‌సైక్లోపీడియా అని వ్యాఖ్యానించారు. లక్షలాది మందికి ఆయన ఉపాధి కల్పించి సినీరంగంలో ఎంతోమందికి అండగా నిలిచారని చెప్పారు. రామోజీరావు నిర్మించిన రెండు సినిమాల్లో నటించానని జయసుధ గుర్తు చేసుకున్నారు.

రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలి : సీఎం చంద్రబాబు - CM Chandrababu on Ramoji Rao

Last Updated : Jun 27, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.