ETV Bharat / state

నువ్వు లేని లోకంలో నేనేం చేయాలి తల్లీ!! - కుమార్తె పురుగుల మందు తాగిందని తండ్రి ఆత్మహత్య - FATHER SUICIDE IN HANAMAKONDA - FATHER SUICIDE IN HANAMAKONDA

Father Died After Daughter Suicide Attempt : ఇంటర్మీడియట్​ పరీక్షల్లో ఫెయిల్​ అయిందని కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తన కూతురు బతుకుతుందో లేదో అని ఆందోళన చెందిన తండ్రి కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది.

father committed suicide
father committed suicide (etv bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 10:15 AM IST

Father Committed Suicide After Daughter Suicide Attempt : కుమార్తె అంటే ఆ తండ్రికి ఎంత ప్రేమో చెప్పడానికి ఆ తండ్రి చేసిన పనే సాక్ష్యం. తన గారాలపట్టి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉందనే విషయం తెలిసి ఆ తండ్రి గుండె విలవిలలాడింది. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తన బంగారు బొమ్మ చావు అంచుల్లో ఉండటం చూసిన ఆ తండ్రి హృదయం బద్ధలైంది. తన కుమార్తెకే ఎందుకు ఇలాంటి దీన స్థితి వచ్చిందనే మనస్తాపంతో, ఆమె బతుకుందో బతకదో అనే అనుక్షణం భయపడ్డాడు. తన ప్రాణం లేనిదే తాను ఈ లోకంలో ఉండలేనంటూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్​ గ్రామంలో గాజ కుమారస్వామి, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఆ యువతి ఇంటర్మీడియట్​ చదువుతోంది. గత ఏడాది ఇంటర్​ ఫెయిల్​ కావడంతో ఒక సంవత్సరం నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఇంటర్మీడియట్​ పరీక్షలు రాసింది. ఈ సంవత్సరం పరీక్షల్లో కూడా ఆమె మళ్లీ ఫెయిల్​ అయింది. పాస్​ కాలేదనే మనస్తాపంతో ఆ యువతి ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

తండ్రి ఆత్మహత్య : వెంటనే ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆ యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో తన తండ్రి గాజ కుమారస్వామి చికిత్స పొందుతున్న తన కుమార్తె బతుకుతుందో లేదో అనే ఆందోళనకు గురయ్యాడు. ఈ ఆందోళనలో తన కుమార్తె బతకదని భావించి, ఇక తన బిడ్డలేని ప్రపంచంలో తాను బతకనని వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. అక్కడ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఈ విషయంపై మృతుడి భార్య రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ విషయం తెలిసి ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

'నాకింకా చదువుకోవాలనుందమ్మా కానీ ఇప్పుడు కుదరదు - అందుకే చనిపోతున్నా' - BRIDE SUICIDE IN KOTHAGUDEM

తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.