ETV Bharat / state

అశ్లీల వీడియోలకు అలవాటై కుమార్తెపై కన్నేసిన తండ్రి- దారుణంగా హతమార్చిన వైనం - Father Killed Daughter

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 5:42 PM IST

Updated : Jun 21, 2024, 1:26 PM IST

Porn Videos Addicted Father Killed Daughter: అశ్లీల వీడియోలకు అలవాటు పడిన ఓ తండ్రి కూమార్తెపై కన్నేసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అదృశ్యమైందని ఫిర్యాదు చేసి పోలీసులు పట్టించుకోవడం లేదని ఠాణాకెళ్లి హంగామా చేశాడు. చివరికి నిజం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.

Porn_Videos_Addicted_Father_Killed_Daughter
Porn_Videos_Addicted_Father_Killed_Daughter (ETV Bharat)

Porn Videos Addicted Father Killed Daughter: అశ్లీల వీడియోలు చూడటం అలవాటు చేసుకున్న ఓ తండ్రి కన్నబిడ్డపైనే కన్నేశాడు. కుమార్తెతో అసభ్యంగా ప్రవరిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అందుకు కుమార్తె నిరాకరించటంతో బండరాయితో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం హైదరాబాద్​లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నిందితుడు తన భార్య, కుమార్తె(13)తో కలిసి నెల రోజుల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ నగరానికి వచ్చాడు. ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి నడిగడ్డ తండాలో కుటుంబంతో ఉంటున్నాడు. నిందితుడికి ఫోన్​లో అశ్లీల వీడియోలు చూడడం అలవాటు. లైంగిక వాంఛ తీర్చుకోవడానికి కుమార్తెపై కన్నేశాడు. ఈనెల 7న ఉదయం 9.45 గంటల సమయంలో వంట చెరకు కోసం వెళ్దామని ఆమెను సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వాంఛ తీర్చాలని కుమార్తెను వేధించాడు.

మైనర్​ బాలికపై లైంగిక దాడి - నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

భయపడ్డ చిన్నారి గట్టిగా కేకలు పెడుతూ బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని భార్య, ఇతరులకు చెబుతుందని భావించిన తండ్రి కుమార్తెను చంపాలనుకున్నాడు. పారిపోతున్న కుమార్తెను పట్టుకుని ముఖంపై గట్టిగా కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయాక తలను నేలకు గట్టిగా కొట్టాడు. ఊపిరాడకుండా చేసి బండరాయితో తల వెనుకభాగంలో కొట్టి కిరాతకంగా హతమార్చాడు.

రోజూ వెళ్లి శవాన్ని చూసొచ్చిన వైనం: చదువుకోవాలని మందలించినందుకు తన కుమార్తె ఇంటినుంచి వెళ్లిపోయిందని నిందితుడు 7వ తేదీనే మియాపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రోజూ కుమార్తె మృతదేహాన్ని చూసొచ్చేవాడు. పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే ఈ నెల 13న నడిగడ్డ తండాకు సమీపంలోని నిర్జన ప్రాంతంలో బాలిక మృతదేహం లభించింది. మృతదేహం దొరికిన ప్రాంతంలో పరిస్థితుల్ని బట్టి పోలీసులు హత్య అని భావించారు.

సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి: దర్యాప్తు జరుగుతున్న క్రమంలో నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె అదృశ్యంపై పట్టించుకోవడం లేదని హంగామా చేశాడు. దర్యాప్తు క్రమంలో 18న పోలీసులకు ఒక సీసీటీవీ ఫుటేజీ లభించింది. 7న అతడు తన కుమార్తెను ఇంటి నుంచి అటవీ ప్రాంతంవైపు తీసుకెళ్తున్నట్లు రికార్డయింది. వెళ్లేటప్పుడు బైకుపై కుమార్తె ఉన్నా తిరిగొచ్చేటప్పుడు మాత్రం ఒక్కడే ఉన్నాడు. దీంతో పోలీసులు అతడిని ఠాణాకు పిలిపించి ప్రశ్నించగా నిజం అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారం - వీడియో తీసిన యువకులు, కోరిక తీర్చాలంటూ బెదిరింపులు - RAPE ON 10TH CLASS STUDENT

Last Updated : Jun 21, 2024, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.