ETV Bharat / state

అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR - FARMERS SUFFERING IN GUNTUR

TDP Initiative for Construction of Cold Warehouses : ఉమ్మడి గుంటూరు జిల్లా అనగానే అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకున్న మిర్చి పంట గుర్తుకువస్తోంది. వచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లభిస్తే పొలాల వద్ద కొందరు, మరి కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్‌లో పంటను విక్రయిస్తారు. ధరలు ఆశాజనకంగా లేని సమయంలో ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి. పసుపు, మినుము, కందులు పండించే అన్నదాతలదీ ఇదే పరిస్థితి. అయితే నిల్వ చేసేందుకు గోదాములు లేక అన్నదాతలు ఆర్ధికంగా విలవిల్లాడిపోతున్నారు.

initiative for construction of cold warehouses
initiative for construction of cold warehouses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 9:46 PM IST

Farmers Suffering Due to Lack of Cold Storage in Joint Guntur District : కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు కోసం రైతన్నలు ఆ పంటను ప్రైవేట్‌ శీతల గోదాములలో నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటకు ఈ అదనపు ఖర్చును తగ్గించేందుకు గత టీడీపీ ప్రభుత్వమే గోదాముల నిర్మాణానికి పూనుకుంది. అయితే వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో అడుగు ముందుకు పడకపోవడంతో ఒక్క గోదాము కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో కర్షకులు పంటను నిల్వ చేసేందుకు ఆర్ధికంగా విలవిల్లాడిపోతున్నారు.

TDP Initiative for Construction of Cold Warehouses Across the State : పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఉద్దేశించిన శీతల గోదాముల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు గిట్టుబాటు దక్కేదాకా ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేలా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెుత్తంగా 13 శీతల గోదాముల నిర్మాణాలను చేపట్టింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, దుగ్గిరాలలో నిర్మాణానికి నిధులు కేటాయించింది. వీటికి సంబంధించి నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పటి వరకు చేపట్టిన పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో శీతల గోదాముల నిర్మాణం పిల్లర్ల దశలో ఆగిపోయింది.

'గుంటూరు యార్డ్‌కు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచే కాక పరిసర జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి కూడా రైతులు పంటతో వస్తుంటారు. ఎంతో కీలకమైన ఈ గోదామును సైతం వైఎస్సార్సీపీ సర్కార్ పూర్తి చేయకుండా వదిలేసింది. నరసరావుపేట మార్కెట్ యార్డ్‌లో నిర్మాణం ప్రారంభించిన శీతల గోదాము కూడా పిల్లర్ల దశలో ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసింది. చిలకలూరిపేట, దుగ్గిరాల శీతల గోదాములు ఇంకా పునాదుల్లోనే ఉండిపోయాయి.' -శివాజీ, ప్రధాన కార్యదర్శి, జిల్లా రైతు సంఘం

TDP Allocated Funds for Construction of 13 Godowns : ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పసుపు, మినుము, కందులు, పెసలు, సెనగలు తదితర పంట ఉత్పత్తులు నిల్వ చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క శీతల గోదామూ లేదు. ఈ నేపథ్యంలోనే పసుపు, మిర్చి పండే ప్రాంతాల్లో మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో యార్డుల్లో నిర్మించాలని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్సీపీ సర్కార్‌ తీరుతో అప్పటివరకు ఖర్చు చేసిన ప్రజాధనం వృథా కావడమే కాకుండా రైతులు పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసేందుకు తీవ్ర అగచాట్లు పడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు ఇచ్చి పూర్తి చేసి ఉంటే ఒక్కో గోదాములో 4 వేల మెట్రిక్ టన్నుల సరకు నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. గోదాముల నిర్మాణానికి సంబంధించి నాబార్డు విరివిగా సాయం అందిస్తున్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో శీతలగోదాములు లేకపోవడంతో రైతులు ప్రైవేటు వాటిపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.

అంతులేని కథ.. గోదాముల కొరత!

ఒకవైపు పెట్టుబడులు పెరిగి, మరో వైపు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వమైనా ఆగిపోయిన నిర్మాణాలను పూర్తిచేయాలని కోరుతున్నారు.

శీతల గిడ్డంగి భవనానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి భూమిపూజ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.