Farmers drained the rain water and used it as irrigation water in Hanamkonda : హనుమకొండ జిల్లా నడికుడ మండలం కౌకొండ గ్రామ శివారులోని వ్యవసాయ భూముల మధ్య గుట్టలు ఉన్నాయి. వ్యవసాయానికి అనువైన భూములు ఉన్నా, సాగునీరు లేక పంటలు పండించడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వర్షం వచ్చినప్పుడు గుట్టల మీదపడిన వర్షపు నీరు వృథాగా పోయేది. గుట్టల సమీపంలో తెనుగువారికుంట ఉన్నప్పటికీ, ఎక్కువ లోతు లేకపోవడంతో నీరు కుంట నిండి వృథాగా పోయేది.
వర్షపు నీటిని కాపాడుకోవాలని ఆలోచించిన రైతులు, స్థానిక ఫీల్డ్ ఆఫీసర్ సహకారంతో ఉపాధి హామీ పథకాన్ని తమ అవసరాలకు అనుగుణంగా మలచుకున్నారు. నీటి సామర్థ్యం పెంచేందుకు కుంటను అభివృద్ది చేసి వర్షపు నీటిని కుంటలోకి మళ్లించే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సుమారు 250 ఎకరాల్లో వంద మంది రైతులు ఈ కుంటలోని నీటి వనరుని ఉపయోగించుకుని పంటలు పండిస్తున్నారు. పది సంవత్సరాల కింద ఖాళీగా ఉండే కుంట, అటువంటి కుంటను మంచి స్థాయికి మెరుగుపరిచామని రైతులు చెబుతున్నారు.
'వర్షం పడినప్పుడు కాకుండా మామూలుగా నీళ్లు లేక పొలం పండించడానికి ఇబ్బందిగా ఉండేది. గుట్ట చుట్టూ కాంటూర్ కంటిన్యూస్టెన్స్ గుంతలు తీయడం వల్ల చెరువు కూడా కొంచెం అభివృద్ధి అయింది. నీళ్లు వృథా కాకుండా చెరువులోకి తీసుకొచ్చేలా గుట్ట చుట్టూ కాంటూర్ కంటిన్యూస్టెన్స్ గుంతలు తీశారు. దీని వల్ల నీటి ఇబ్బంది లేదు. పంటలు కూడా బాగా పండుతున్నాయి. - రైతులు
Farmers Cultivating Crops in 250 acres by Rainwater : గతంలో తెనుగువారికుంట దసరా పండగ వరకే నీళ్లు లేక వెలవెలపోయేదని, ప్రస్తుతం మార్చి వరకు కుంటలో నీరు పుష్కలంగా ఉంటున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెరువు కట్టకు కొత్త తూమును ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా ఈ కుంటకు కాల్వను ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా తమ పంటలు పండుతాయని రైతులు అంటున్నారు. ఉపాధి హామీ పథకం సహాయంతో రైతులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రతి వర్షపు నీటి చుక్కలను రైతులు తమ సాగు భూములకు మళ్లిస్తూ గుట్టల మధ్య పచ్చని పంటలను పండిస్తున్నారు.
'చెరువులోకి నీళ్లు రావడానికి మా టెక్నికల్ బృందం, మండల స్థాయి అధికారుల సహకారంతో చెరువుకు ఆనుకుని ఉన్న గుట్ట చుట్టూ సుమారు 350 ఎకరాల్లో కాంటూర్ కంటిన్యూస్టెన్స్ గుంతలు తీశారు. వచ్చే ప్రతి వర్షపు నీటి ద్వారా భూగర్భజలాలు పెంపొందించుకోవడం కోసం ఉపాధి హామీ పనుల ద్వారా నిర్వహించాం.' - రవి, ఫీల్డ్ అసిస్టెంట్
పసుపు పంటకు రికార్డు ధర - ఆనందంలో అన్నదాతలు
దయనీయంగా నర్సరీ రైతుల పరిస్థితి - ప్రభుత్వ రాయితీ అందించాలంటూ వేడుకోలు