Farmer Crop Loan Waiver Funds Credited in Farmers Accounts: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసింది. రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో నేరుగా రూ.7 వేల కోట్ల నిధులు జమ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రైతు పంట రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని రేవంత్ తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని పదేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు.
టిడ్కో ఇళ్లకు హడ్కో చేయూత- రూ.5వేల కోట్ల రుణ మంజూరుకు హామీ - Tidco Houses in ap
"తొలి విడతలో రూ.లక్ష వరకు ఉన్న రైతుల రుణాలు మాఫీ. తొలి విడత రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లు జమ చేస్తున్నాం. రైతుల అప్పులు రూ.2 లక్షల వరకు చెల్లించాలని హామీ ఇచ్చాం. డిసెంబరు 9న రైతుల రుణాల మాఫీకి కటాఫ్ పెట్టుకున్నాం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించిన రోజు డిసెంబరు 9. తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబరు 9. డిసెంబరు 9 అనేది మనందరికీ పండగ రోజు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు మాఫీ: రెండో విడతలో రూ.లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, మూడు విడత్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఆగస్టులోగా రూ.2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. రేషన్‌కార్డు ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్నట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీకి ప్రామాణికం పాస్ పుస్తకమే రేషన్ కార్డు కాదని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి నెలా రూ.7 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. జీతాలు, పింఛన్లు కోసం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. పథకాలకు ఏడు నెలల్లోనే రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయం దండగ కాదు, పండగ అని నిరూపించామని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ప్రజల సొమ్ము సర్వే రాళ్లపాలు- రూ.525 కోట్లు మంచినీళ్లలా వెచ్చించిన ఏపీఎండీసీ - LAND RESURVEY stones