ETV Bharat / state

నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో ఇంటిదొంగల గుట్టురట్టు - సీఐడీకి చిక్కిన మరో ముగ్గురు పోలీసులు

Fake Passport Scam Telangana Latest Update 2024 : నకిలీ ధ్రువీకరణపత్రాలతో విదేశీయులకు భారత పాస్‌పోర్టులు ఇప్పించిన వ్యవహారంలో ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. సీఐడీ విభాగం దర్యాప్తు క్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాత్ర బట్టబయలైంది. ఇప్పటికే ఇద్దరు ఎస్​బీ పోలీసులు సీఐడీకి చిక్కి కటకటాల పాలుకాగా తాజాగా మరో ముగ్గురి బాగోతం బహిర్గతమైంది. వీరితోపాటు మరో వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేయగా ఈ కేసులో ఇప్పటివరకు నిందితుల సంఖ్య మొత్తం 22కు చేరింది.

Fake Passport Scam Case Update in Telangana
3 More Police Officer Arrested in Fake Passport Scam
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 11:46 AM IST

Updated : Mar 12, 2024, 2:35 PM IST

నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో ఇంటిదొంగల గుట్టురట్టు సీఐడీకి చిక్కిన మరో ముగ్గురు పోలీసులు

Fake Passport Scam Telangana Latest Update 2024 : శ్రీలంక సహా ఇతర దేశాలకు చెందిన వారికి నకిలీ డాక్యుమెంట్లతో భారత పాస్‌పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా పోలీసు శాఖకు చెందిన ముగ్గురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గతేడాది హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సమయంలో నకిలీ పాస్‌పోర్టు ముఠాకు ఈ ముగ్గురు సహకరించినట్లు తేలింది.

పంజాగుట్ట ఎస్బీ విభాగంలో పనిచేసి ప్రస్తుతం షీటీంలో ఏఎస్సైగా ఉన్న గుంటూరు వెంకటేశ్వర్లు, మారేడ్‌పల్లి ట్రాఫిక్ ఏఎస్సై తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ఏఎస్సై షేక్ నజీర్ బాషను సీఐడీ అరెస్ట్ చేసింది. వీరితోపాటు ఎస్​ఆర్​నగర్​లోని ఆధార్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కొప్పిశెట్టి కల్యాణ్‌ను కూడా సీఐడీ రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నిందితుల సంఖ్య 22కు చేరింది.

డబ్బు ఆశ చూపించి అక్రమాలకు తెర : హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్‌ హిల్స్ బడి మసీదు ప్రాంతానికి చెందిన అబ్దుస్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారిగా సాగిన బోగస్ పాస్​పోర్టుల వ్యవహారం గత జనవరిలో వెలుగు చూసింది. అప్పట్లోనే ఇద్దరు ఎస్బీ సిబ్బంది సహా 12 మంది ఏజెంట్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సత్తార్ ముఠాకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎస్బీ సిబ్బందికి డబ్బు ఆశ చూపించి దందా సాగించారు.

నకిలీ పాస్​పోర్టుల కేసు - 14కు చేరిన అరెస్టుల సంఖ్య

Passports Fraud in Telangana 2024 : హైదరాబాద్​తోపాటు నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆదిలాబాద్​లోని ఏజెంట్లు ఎక్కువగా ఇలాంటి కార్యకలపాలకు పాల్పడ్డారు. ఒక్కో పాస్​పోర్టు విచారణ కోసం ఎస్బీ సిబ్బందికి వేలల్లో ముట్టజెప్పి పని కానిచ్చారు. విద్యార్హత, ఆధార్ తరహా గుర్తింపు పత్రాలన్నీ బోగస్​వే అయినా సత్తార్ ముఠా మాయలో పడిన ఎస్బీ సిబ్బంది మోసాన్ని గుర్తించలేకపోయారు.

సత్తార్ ముఠా ఇప్పటివరకు 95 మంది శ్రీలంక శరణార్థులతోపాటు మరో 30 మంది ఇతర దేశస్థులకు బోగస్ పత్రాలతో భారత పాస్‌పోర్టులు ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. కాగా వారి సమాచారాన్ని, పాస్‌పోర్టులను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించారు. సీఐడీ దర్యాప్తు క్రమంలో సత్తార్ ముఠాపై గతంలో ఇదే తరహా కేసులున్నట్లు తేలింది.

తొలుత నాంపల్లిలో గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పని చేసిన సత్తార్ సులభంగా డబ్బు సంపాదించేందుకు 2011లో నకిలీపత్రాలు సృష్టించే దందాకు తెరలేపాడు. చెన్నైకి చెందిన ఓ పాస్​పోర్టు బ్రోకర్​తో పరిచయం ఏర్పర్చుకుని నకిలీ పత్రాలు సృష్టించినందుకు 75 వేల రూపాయలు ముట్టజెప్పేవాడు. అనంతరం పాస్​పోర్ట్ జారీ ప్రక్రియపై దృష్టి సారించాడు. శ్రీలంక దేశస్థులతోపాటు శరణార్థులతో మంచి సంబంధాలు కలిగిన సదరు బ్రోకర్​కు నకిలీ ధ్రువీకరణ, గుర్తింపు పత్రాల్ని సమకూర్చేందుకు సత్తార్ పాస్​పోర్టు బ్రోకర్​తో డీల్ కుదుర్చుకున్నాడు. త్తారు చూపించిన డబ్బు ఆశతో ఆయనకు ఎస్బీ అధికారులు సహకరించారు. మరోవైపు ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో కీలక పరిణామం - సీఐడీ అదుపులో ఏఎస్ఐ

నకిలీ పాస్​పోర్ట్​ల కేసులో ఎస్బీ పోలీసుల అక్రమాలు - అబ్దుల్‌ సత్తార్‌ ముఠాకు సహకరించినట్లు గుర్తింపు

Last Updated : Mar 12, 2024, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.