ETV Bharat / state

'ఆపరేషన్ ధూల్‌పేట్'- గంజాయి గ్యాంగ్స్‌కు చుక్కలు చూపిస్తున్న ఎక్సైజ్ పోలీసులు - Operation Dhoolpet by Excise Police - OPERATION DHOOLPET BY EXCISE POLICE

Operation Dhoolpet : హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ శాఖ దాడులతో గంజాయి స్మగ్లర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిందితులు ఇళ్లకు తాళాలు వేసి ఆరుబయట నుంచే అక్రమ కార్యకలాపాలు చేపడుతున్నారు. ఒక్కోసారి పోలీసులకే ఎదురుతిరిగే ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటినీ సమర్థంగా తిప్పికొడుతున్నామంటున్న ఆబ్కారీ శాఖ ఆగస్టు 31 నాటికి గంజాయి అమ్మకం నిర్మూలన దిశగా 'ఆపరేషన్‌ ధూల్‌పేట'ను చేపట్టింది.

Excise Police Raids in Dhoolpet
Excise Police Raids in Dhoolpet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 2:23 PM IST

Excise Police Raids in Dhoolpet : హైదరాబాద్ ధూల్‌పేట్‌లో స్మగ్లర్లు, అమ్మకందార్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 31 నాటికి ధూల్‌పేటలో గంజాయి అమ్మకాల నిర్మూలన దిశగా ముందుకెళ్తున్నట్లు ఎక్సైజ్ యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ మేరకు 'ఆపరేషన్ ధూల్‌పేట' పేరుతో 25రోజుల నుంచి ఆబ్కారీశాఖ సహా వివిధ పోలీస్‌ బృందాలు ధూల్‌పేట్‌లో ఇంటింటి సోదాలు నిర్వహిస్తూ జల్లెడ పడుతున్నాయి. స్మగ్లర్లు ఎక్సైజ్ దాడులకు భయపడి ఇళ్లకు తాళాలు వేసి ఆరు బయటి నుంచే గంజాయి వ్యవహారాలు నిర్వహిస్తున్నారు.

ఆపరేషన్ ధూల్‌పేట్ గంజా గ్యాంగ్స్‌కు చుక్కలు చూపిస్తున్న ఎక్సైజ్ పోలీసులు (ETV Bharat)

2016లో ధూల్‌పేటలో నాటుసారా తయారీ నిర్మూలించేందుకు ఆబ్కారీ అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. నాటుసారా కథ ముగిసిందని భావించారు. ఇప్పుడు అదే ధూల్‌పేటను కొందరు అక్రమార్కులు గంజాయి అడ్డాగా మర్చారు. ఇక్కడి నుంచే హైదరాబాద్ మొత్తానికి గంజాయి అమ్మకాలు జరిపే స్థాయికి ఎదిగారు. 15 మందికి పైగా చెప్పుకోదగ్గవాళ్లు ఈ వ్యాపారంలో కోట్లు గడించారు. మరో 20 మంది స్థానికంగా ఇళ్లు, దుకాణాల నుంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

దందాలో మహిళలే అధికం : 100 నుంచి 150 మంది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకాలు చేపట్టడం, డోర్ డెలీవర్ చేయడం లాంటివి చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారంలో మగవారి కంటే మహిళలే ముందుండి నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా చేస్తున్న 15 మందిలో ఆరుగురుని ఎక్సైజ్ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.

నానక్​రామ్​గూడ అడ్డాగా నీతూబాయి గాంజా దందా - పోలీస్ డెకాయ్‌ ఆపరేషన్‌లో బహిర్గతం

ఎక్సైజ్ పోలీసులను కట్టడి చేసేందుకు స్మగ్లర్లు అనేక ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పగలు, రాత్రులు తేడా లేకుండా పోలీసులు దాడులు చేస్తున్నారని, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ లీగల్ నోటీసులు పంపించడం వరకు వెళ్లినట్లు సమాచారం. ఆపరేషన్ ధూల్‌పేటలో భాగంగా 25 రోజుల్లో 54 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 100 కిలోల గంజాయితో పాటు 12 వాహనాలను జప్తు చేసి 26 మందిని బైండోవర్ చేశారు.

మత్తు పదార్థాల వల్ల యువత బంగారం లాంటి భవిష్యత్‌కు నష్టం జరుగుతుందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గంజాయిని, డ్రగ్స్‌, నాటుసారా నిర్మూలన దిశగా పని చేస్తున్నామన్నారు. ఈ అంశంలో విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని కోరారు.

బాలానగర్​లో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్​

Ganja Gangs in Hyderabad : హైదరాబాద్​లో గుప్పుమంటున్న గంజాయి.. మురికివాడలే అడ్డాలు.. టీనేజర్లే బాధితులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.