Excise Department Checks on Drug Traffic : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై ఆబ్కారీ శాఖ ముమ్మరంగా దాడులు చేసింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు నాలుగు నెలలుగా జరిపిన దాడుల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలతో పాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
Country Liquor Seized in Telangana : ఇందులో ఒక్క ఏప్రిల్ మాసంలోనే రూ.33.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల సరకును పట్టుకున్నారు. ఈ మాదక ద్రవాలపై మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించారు. మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలాసన్‌రెడ్డి నేతృత్వంలోని బృందాలు నాలుగు నెలలుగా అనేక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలను పట్టుకున్నారు. దీంతో పాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను జప్తు చేశారు. ఇందులో ఒక్క ఏప్రిల్‌లోనే రూ.33.5 కోట్ల విలువైన సరకును పట్టుకున్నారు. 4 నెలల్లో మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించారు.
సారా, కల్తీకల్లు నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ : ఎన్నికల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తయారవుతున్న సారా స్థావరాలపై ఆబ్కారీశాఖ 350 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా విస్తృతం చేసింది. గత 4 నెలల్లో రూ.8.27 కోట్ల విలువైన సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 593 వాహనాలను జప్తు చేశారు. కల్తీ కల్లు తయారీకి వినియోగించే రూ.28.28 లక్షల విలువైన 565.5 కిలోల క్లోరల్ హైడ్రేట్, రూ.54.63 లక్షల విలువైన 5.463 కిలోల ఆల్ప్రాజోలం, రూ.3.04 లక్షల విలువైన 1.52 కిలోల డైజోపాంను స్వాధీనం చేసుకున్నారు.
ఇక రోడ్డు మీదనే "డ్రగ్స్" టెస్టులు! - పోలీసులు ఈజీగా ఇలా పట్టేస్తారు! - Drugs and Drive Tests